Home

»

Latest News

వందకోట్ల ఇల్లు బేరం చేస్తోన్న హీరోయిన్..

Oct 28, 2016 10:16AM

ప్రజంట్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రియాంక చోప్రా అని చెప్పకతప్పదు. మిస్ వరల్డ్ కిరిటాన్ని సాధించిన తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తన అందం, అభినయంతో అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటికే బాలీవుడ్‌ను ఏలుతున్న నటీమణులు ఒక్కొక్కరిగా తెరమరుగు అవుతుండటంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ అమ్మడు వన్‌ బై వన్ హిట్లు కొట్టుకుంటూ నెంబర్‌వన్  పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆమెకున్న పాపులారిటీ దృష్ట్యా అనేక బడా కంపెనీలు ఎండార్స్‌మెంట్ కాంట్రాక్ట్‌లు ఇచ్చాయి. దీంతో నేమ్‌తో పాటు ఫేమ్‌ కూడా కలిసివచ్చింది.

రీసెంట్‌గా ప్రియాంక చేసిన అమెరికన్ టీవీ షో "క్వాంటికో"తో వరల్డ్ వైడ్ ఆమె పేరు మారు మోగిపోయింది. ఈ ఒక్క షోతో హాలీవుడ్ హీరోయిన్లతో సమానంగా పేరు సంపాదించింది ప్రియ. అందుకు గానూ ఒక్కో ఎపిసోడ్‌కు కొన్ని కోట్ల రూపాయల పారితోషికం పొందుతోంది. డబ్బు వస్తుంటే విలాసవంతమైన జీవితం గడపాలని ఎవరికి ఉండదు చెప్పండి అందుకు ప్రియాంక కూడా మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బడా బిజినెస్‌మెన్ల ఇళ్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తోందట ఈ మాజీ మిస్ వరల్డ్ . అంధేరిలోని ఓ ఏరియాలో సుమారు 100 కోట్ల విలువైన లగ్జరీ హౌస్ సొంతం చేసుకుంటోందట..అనంతరం దానిని తన టేస్టుకు తగ్గట్టుగా రీమోడల్ చేయించుకుంటోందట. దానికి మరింత ఖర్చవుతుందని సమాచారం. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com