Home

»

Latest News

పెట్టుడు మీసం ప్రెస్‌మీట్‌లో ఊడిపోయింది..

Oct 28, 2016 10:55AM

ఒక సినిమాలో ఒకతను పెళ్లిచూపులకు నీట్‌గా తయారై వెళదామని సెలూన్‌ షాప్‌కి వెళితే అక్కడ పొరపాటున మీసం ట్రీమ్ చేసేస్తాడు బార్బర్. ఇక చేసేది లేక పెట్టుడు మీసం పెట్టుకుని పెళ్లిచూపులకు వెళతాడు ఆ వ్యక్తి. అయితే పెట్టుడు మీసం ఎంతసేపు ఉంటుంది..ఒక టైంలో జారిపోవడంతో మనోడి పరువు పోవటం అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఇప్పుడు అచ్చం అలాంటిదే ఒక హీరో విషయంలో జరిగింది. అతను ఎవరో కాదు తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరో కార్తీ. అతను తాజాగా నటించిన కాష్మోరా సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు.

అయితే సినిమా కోసం మీసాన్ని తీయించుకున్న కార్తీ..హైదరాబాద్‌కు అలా వెళితే బాగోదు అనుకున్నాడో ఏమో కానీ..తన క్లీన్ షేవ్‌ ముఖం మీద ఒక మీసం అంటించుకుని వచ్చాడు. మైకు పట్టుకుని కాష్మోరా చిత్ర విశేషాలను మీడియాకు వివరించుకుంటూ వెళ్లిపోయాడు. అంతలో ఉన్నట్లుండి ఎడమవైపు మీసం కొంచెం కిందకు జారింది. ఆ విషయం ముందు పట్టించుకోలేదు..కానీ కాసేపు ఆగిన తర్వాత మరికొంత ఊడి..ఇంకా కిందకు జారి నోటికి అడ్డురావడంతో వెంటనే అలర్టైన కార్తీ. దాన్ని సరిచేసుకుని, మళ్లీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. కార్తీ నీట్ షేవ్‌తో వచ్చినా ఎవరు పట్టించుకోరేమోగానీ ఇప్పుడు ఆ మీసం జారీ పోవడం వలన మనోడిపై జోక్స్‌వేసుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. టేకిట్ ఈజీ కార్తీ.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com