Home

»

Latest News

నాకు లవర్ లేడా..ఎవరన్నారు..?

Feb 24, 2016 3:56PM

 

ఈ మధ్య ప్రియాంక చోప్రా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది. బాజీరావ్ మస్తానీ తో భారీ హిట్ కొట్టి, హాలీవుడ్ లో క్వాంటికో టీవీ సీరీస్, బే వాచ్ సినిమాలతో కెరీర్ లోనే సూపర్ ఫామ్ లోనే ఉంది. అన్ని విషయాల్లోనూ ఓపెన్ గా ఉండే ప్రియాంక, తన ప్రేమ విషయంలో మాత్రం ఎప్పుడూ దొరకలేదు. గతంలో షాహిద్ కపూర్ తో ప్రేమ వ్యవహారం నడిపిందని వార్తలు వచ్చినా, ఎక్కడా నోరు విప్పలేదు. లేటెస్ట్ గా మాత్రం  ఒక ప్రెస్ మీట్లో, ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చింది ప్రియాంక. " నాకు వ్యక్తిగత జీవితముంది. పబ్లిగ్గా దాని గురించి చెప్పడం నాకిష్టం ఉండదు. నా బంధాల్ని సీక్రెట్ గా ఉంచడమే నాకిష్టం. నాకు లవర్ లేడని ఎవరన్నారు..ఏమో! నేను ఇప్పటికే డేటింగ్ లో ఉన్నానేమో..షూటింగ్స్ లో తిరుగుతూ బిజీగా ఉన్నా కాబట్టి, తను నాతో ఉండటానికి కుదరట్లేదేమో " అంటూ హింట్ ఇచ్చింది ప్రియాంక. దీంతో ఇప్పుడు ప్రియాంక లవర్ ఎవరు అంటూ బాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. ఆ వ్యక్తి ఎవరన్నది త్వరలో ప్రియాంక చెబుతుందేమో చూడాలి మరి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com