
బాలీవుడ్ లో ఈ మధ్య వైవిధ్యమైన కథలు ఎక్కువగా వస్తున్నాయి. త్వరలో రిలీజ్ కాబోతున్న కి అండ్ కా సినిమాయే వీటి కోవలోకే చేరుతుంది. సమాజంలో, స్త్రీ పురుషలకు మధ్యనున్న అంతరాలను, కట్టుబాట్లను సున్నితంగా ఎత్తిపొడుస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో హీరో అర్జున్ కపూర్ హై హీల్స్ వేసుకుని చేసిన హైహీల్ వీడియో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో అదరగొడుతోంది. ఇప్పటికే ఈ సాంగ్ 2 మిలియన్ల వ్యూస్ ను దాటేసింది. ఈ సినిమా గతంలో తెలుగులో వచ్చిన జంబలకిడి పంబ, మిస్టర్ పెళ్లాం సినిమాలను పోలి ఉండటం విశేషం.






