
ఇరుముడి మూవీలో క్యారక్టర్ కి తగ్గట్టుగా నీట్ పెర్ఫార్మ్ చేసి మెప్పించిన భామ ప్రియా భవాని శంకర్. ఈ రోజు ఉదయమే తన కొత్త సినిమా డిమోట్ కాలనీ పార్ట్ 3 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సాయంత్రానికి పెళ్లి న్యూస్ చెప్పుకోవాల్సిన పరిస్థితి. అందుకే కళ్యాణం గడియలు వచ్చినా, కక్కు వచ్చిన ఆగవనే సామెత సినీ సైట్స్ కి కూడా వర్తిస్తుంది. మరి పూర్తి మ్యాటర్ చూద్దాం.
రీసెంట్ గా ప్రియా భవానీ శంకర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలలో ఈ బ్యూటీ సంప్రదాయబద్ధమైన దుస్తులలో అత్యంత అందంగా కనిపించడమే కాకుండా, మెడలో మల్లెపూల దండలు ధరించి ఉండటం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అంతేకాకుండా, తన చేతులకు అందంగా పెట్టుకున్న మెహందీ డిజైన్లను చూపిస్తూ ఆమె పోస్ట్ చేసిన చిత్రాలు ఆమె ఇంట్లో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయనే ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహత మిత్రుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా ఈ వేడుకలు జరుగుతున్నట్లు సమాచారం.

అయితే ఈ వార్తలపై అభినందనలు వెల్లువెత్తుతున్నప్పటికీ, అధికారికంగా తేదీలు మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ బ్యూటీ ప్రేమ కథ వెనుక ఒక అందమైన ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉంది. ప్రియా భవానీ శంకర్, ఆమె చిరకాల ప్రియుడు రాజ్వెల్ రాజ్ పరిచయం ఏకంగా కాలేజీ రోజుల నాటిదే కావడం విశేషం. అప్పటి నుంచి మొదలైన వారి పరిచయం కాలక్రమేణా గాఢమైన ప్రేమగా మారింది. దాదాపు పదేళ్లకు పైగా ఈ బంధం కొనసాగుతోందని స్వయంగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు
ఇది కూడా చదవండి: కొండగట్టు అంజన్న సన్నిధిలో శ్రీకాంత్: ఏమని వేడుకున్నాడో తెలుసా!.
అంతేకాకుండా, సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత బంధానికి ఎప్పుడూ అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఈ జంట ముందడుగు వేస్తూ 2022వ సంవత్సరంలోనే కలిసి ఒక సరికొత్త కలల ఇంటిని కూడా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి పెళ్లిపై కోట్లాది మంది అభిమానులలో ఎప్పుడూ ఉత్కంఠ నెలకొని ఉంది.

ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం ప్రకారం, అతి త్వరలోనే ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటవుతారని తెలుస్తోంది. భారీ హంగామాకు దూరంగా, అత్యంత ఆత్మీయుల మధ్య సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని వారు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మీకు నచ్చవచ్చు: అన్నా లెజినోవా ఆస్తులు ఎన్నో తెలుసా!
మీకు నచ్చవచ్చు:టాలీవుడ్ దర్శకుల సీక్రెట్!
[Priya Bhavani Shankar Wedding News, Priya Bhavani Shankar wedding, Irumudi heroine marriage, Rajvel Raj girlfriend, Priya Bhavani Shankar latest news, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






