
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న ‘బ్లడీ రోమియో’పై మొదటి నుంచీ మంచి హైప్ ఉంది. ముఖ్యంగా నాని ఇందులో చెఫ్ కమ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడనే కాన్సెప్ట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనే విషయంలో ఇప్పటివరకు రకరకాల పేర్లు వినిపించాయి.
ముందుగా ‘బ్లడీ రోమియో’లో నాని సరసన మీనాక్షి చౌదరి నటించబోతుందని ప్రచారం జరిగింది. ఇటీవలే ఆమెను ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో నాని, మీనాక్షి జోడీ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ విషయంలోనే ట్విస్ట్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. మీనాక్షి చౌదరి స్థానంలో ‘ప్రీతీ ముకుందన్’ పేరు తెరపైకి వచ్చింది. సుజీత్ డిజైన్ చేసిన పాత్రకు మీనాక్షి కంటే ప్రీతీ ముకుందన్ బాగా సెట్ అవుతుందని మేకర్స్ భావించినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రీతీనే హీరోయిన్‌గా దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ప్రీతీ ముకుందన్ విషయానికి వస్తే.. ఈ మధ్య కాలంలో వరుస అవకాశాలతో సౌత్‌లో బిజీ అవుతున్న యంగ్ హీరోయిన్. ఇప్పటికే తమిళం, మలయాళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. నాని లాంటి స్టార్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ రావడం ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ అనే చెప్పాలి.
మరోవైపు ‘బ్లడీ రోమియో’ మామూలు యాక్షన్ సినిమా కాదని మొదటి నుంచీ మేకర్స్ హింట్ ఇస్తున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన యానిమేటెడ్ ప్రమోలో ఆయనను ‘నంబర్ వన్ చెఫ్ అండ్ గ్యాంగ్‌స్టర్’గా పరిచయం చేశారు. యాక్షన్, డార్క్ హ్యూమర్, ఫన్, లవ్ కలిసిన స్టైలిష్ కథగా ఈ సినిమాను సుజీత్ తెరకెక్కించబోతున్నాడు.
అంతేకాదు.. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఎంట్రీ నిజమైతే సినిమాకు మరో క్రేజీ అట్రాక్షన్ యాడ్ అయినట్టే. నాని, పృథ్వీరాజ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో పెరుగుతోంది.
‘బ్లడీ రోమియో’ రెగ్యులర్ షూటింగ్ ఈ అక్టోబర్‌లో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌తో పాటు లండన్, యూకేలోని ఇతర ప్రాంతాలు, ఢిల్లీలో కీలకమైన షెడ్యూల్స్ ఉండనున్నాయి. లండన్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
ఇది కూడా చదవండి: రణబాలి టికెట్ రేట్ల పెంపు.. మేకర్స్ కీలక ప్రకటన.!
[Preity Mukhundhan In Bloody Romeo, Bloody Romeo Movie, Preity Mukhundhan, Natural Star Nani, Director Sujeeth, Meenakshi Chaudhary, Nani Next Movie, Telugu Film News]
.webp)






