
మూతిపై సరిగ్గా మీసాలు కూడా మొలవకుండానే దక్షిణ భారతీయ చలన చిత్ర చరిత్రలో డాన్స్ మాస్టర్ గా ప్రభుదేవా(Prabhudeva)సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. జగదేక వీరుడు అతిలోక సుందరిలోని ఎవర్ గ్రీన్ సాంగ్' అబ్బని తియ్యని దెబ్బ' నే స్మాల్ ఎగ్జామ్ పుల్. ఆ విధంగా హిస్టరీ గురించి చెప్పుకోవడం స్టార్ట్ చేసే రిపీట్ గా చెప్పుకుంటూనే ఉంటాం. స్టెప్స్ లో తనదైన బాడీ మూమెంట్ ఇచ్చి హీరోలకి ఫ్యాన్ బేస్ పెంచిన మాస్టర్ కూడా. భరత నాట్యానికి కి సంబంధించి కూడా ప్రావీణ్యం ఉందనేలా తనే హీరోగా వచ్చిన ప్రేమికుడు మూవీలో భరత నాట్యం కూడా చేసాడు.
చెన్నై నగరం వేదికగా ప్రభుదేవా గురువు శ్రీ ఉడుపి లక్ష్మీనారాయణన్ 100వ జయంతి వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించబడ్డాయి. తన గురువుకు ఘన నివాళి అర్పిస్తూ ఈ ప్రత్యేక సందర్భంలో ప్రభుదేవా వేదికపై భరతనాట్యం ప్రదర్శన ఇచ్చారు. గురువు గారి నూరు సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని, భక్తిని చాటుకోవడానికి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. కొందరు అభిమానులు ప్రభుదేవా గురుభక్తిని కొనియాడగా, సాంప్రదాయ శాస్త్రీయ నృత్య అభిమానులు మరియు ప్రొఫెషనల్ డ్యాన్సర్ల నుండి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదంపై ప్రముఖ నటి, శిక్షణ పొందిన నాట్య కళాకారిణి ప్రీతి సంజీవ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రభుదేవా ప్రదర్శనపై కఠిన వ్యాఖ్యలు చేశారు. "శాస్త్రీయ నృత్యం మాత్రమే పదే పదే తప్పుగా ప్రదర్శించబడుతోంది, అయినా ప్రజలు దాన్ని ప్రశ్నించకుండా ఆదరిస్తున్నారు. ప్రభుదేవా వంటి గొప్ప దిగ్గజ నటుడు మరియు నాట్యకారుడు ఇంత పెద్ద క్షమించరాని తప్పు చేస్తారని నేను అస్సలు ఊహించలేదు.100 ఏళ్ల శతాబ్ది ఉత్సవాల వంటి పవిత్రమైన వేదికపై ప్రభుదేవాకు బదులుగా భరతనాట్యంలో ఎంతో కష్టపడి శిక్షణ పొందిన యువ నాట్య కళాకారులకి అవకాశం ఇచ్చి ఉంటే, వర్ధమాన కళాకారులకు అది ఒక గొప్ప గుర్తింపుగా ఉండేది అని వ్యాఖ్యానించారు.
also read: రాశీఖన్నాకి అరుదైన బహుమతి ఇచ్చిన స్టార్ హీరో..మనతోనే మనం గడుపుతున్నామా!
ప్రీతి చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు, నాట్య ప్రేమికులు రెండు వర్గాలుగా విడిపోయి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ నృత్యాల వ్యాకరణం, నియమాలు, సంప్రదాయాలు చాలా పవిత్రమైనవని, వాటిని కచ్చితంగా పాటించాల్సిందేనని ఒక వర్గం వాదిస్తోంది. శాస్త్రీయ కళల అసలు రూపాన్ని దెబ్బతీయకూడదని వారు చెబుతున్నారు. అయితే మరొకవైపు ప్రభుదేవా అభిమానులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఇది కేవలం తన గురువుకు అర్పించిన ఆత్మీయ నివాళి మాత్రమేనని, దీనిని సాంకేతిక కోణంలో కాకుండా భావోద్వేగం, గురుభక్తి దృష్టితో చూడాలని అభిప్రాయపడుతున్నారు. భారతీయ నృత్య రంగానికి ప్రభుదేవా చేసిన సేవలు అమోఘమైనవని, ఆయన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని మద్దతుదారులు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, సాంప్రదాయ శాస్త్రీయ నృత్యాలలో కళాకారులకు ప్రయోగాల స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి? శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను ఎంతవరకు కాపాడుకోవాలి? అనే అంశాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.
Prabhu Deva, Preethi Sanjeev







