Home

»

Latest News

Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ క్రేజీ అప్‌డేట్.. టీజర్ వచ్చేది ఆ రోజే!

Jun 3, 2026 9:17AM

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' (Spirit). ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఈ చిత్రంలో ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ కల్ట్ కాప్ డ్రామాలో ప్రభాస్ లుక్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, అటిట్యూడ్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయా అని రెబెల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా భారీ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్‌తో షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నాటికి సినిమాకు సంబంధించిన పూర్తి షూటింగ్ పార్ట్‌ను ముగించాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. సందీప్ రెడ్డి పక్కా ప్లానింగ్ మరియు స్క్రిప్ట్ వర్క్‌తో రంగంలోకి దిగడంతో, ఇప్పుడు జరుగుతున్న జెట్ స్పీడ్ షెడ్యూల్స్ చూస్తుంటే ఆయన అనుకున్న సమయానికే, అంటే ఈ డిసెంబర్ కల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 2027 మార్చి 5న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ లాంగ్ గ్యాప్‌లో పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సినిమా రిలీజ్‌కు ముందే అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించేందుకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ సిద్ధమవుతోంది. రాబోయే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వడానికి సందీప్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట.

అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే కానుకగా 'స్పిరిట్' చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సందీప్ రెడ్డి మార్క్ ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ పోలీస్ అవతార్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూడటానికి యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com