
ప్రభాస్–సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. సినిమా క్లైమాక్స్ కోసం చిత్రబృందం భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ షెడ్యూల్లోనే ప్రభాస్‌తో ఓ ప్రత్యేకమైన పాటను కూడా చిత్రీకరించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
‘స్పిరిట్’ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చాలా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తదుపరి షెడ్యూల్లో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సందీప్ గత చిత్రాల్లో క్లైమాక్స్ సన్నివేశాలు ఎంత ఇంటెన్స్‌గా ఉంటాయో తెలిసిందే. దీంతో ప్రభాస్‌తో ఆయన ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
.webp)
క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్‌పై ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ పాటను రూపొందించబోతున్నారట.
ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో ఆయన గాయాలతో, రఫ్ లుక్‌లో కనిపించి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. ఇక కథలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ప్రభాస్ మరింత వైల్డ్, మాస్ అవతార్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘స్పిరిట్’ దీపావళి కానుకగా అక్టోబర్ 29, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చదవండి: లెజెండ్ సినిమా చేయడం నచ్చలేదు.. రాధికా ఆప్టే కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్!
[Spirit Climax Shooting Update, Prabhas Spirit, Spirit Movie Update, Spirit Climax Shooting, Spirit Special Song, Prabhas, Sandeep Reddy Vanga, Triptii Dimri, Spirit Release Date, Telugu Film News]






