
ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ విషయంలో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా షూటింగ్ తుది దశకు చేరుకుంది. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.
‘ఫౌజీ’ని 2027 మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ‘ఫౌజీ’ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ‘ఫౌజీ’పై ఉన్న అంచనాలకు ప్రభాస్ బర్త్‌డే టీజర్ మరింత హైప్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకా రెండు యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తి చేయాల్సి ఉందని సమాచారం. వాటిలో ఒక ఫైట్ ప్రస్తుతం షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ బ్లాక్స్ పూర్తయిన తర్వాత సినిమా క్లైమాక్స్ షూటింగ్‌పై ఫోకస్ పెట్టనున్నారు.
‘ఫౌజీ’ క్లైమాక్స్ కోసం మేకర్స్ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు దాదాపు నెల రోజుల పాటు క్లైమాక్స్ షూట్ చేయనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయినట్టే.
‘ఫౌజీ’ మార్చిలో విడుదలైతే ఇప్పటికే మార్చిపై కర్చీఫ్ వేసిన ప్రభాస్ మరో మూవీ 'స్పిరిట్' రిలీజ్ డేట్ మారే అవకాశముంది.
ఇది కూడా చదవండి: రణబాలి ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండకు బిగ్ టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఉంది.!
[Fauzi New Release Date, Prabhas Fauzi Movie, Fauzi On March 18th 2027, Spirit Movie, Rebel Star Prabhas, Hanu Raghavapudi, Sandeep Reddy Vanga, Telugu Film News]





