
రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాకు టికెట్ దొరకకపోవడంతో నిరాశ చెందిన ఓ అభిమాని.. ఎప్పటికైనా అదే థియేటర్‌ను కొనాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే కష్టపడి పైకొచ్చి ఆ థియేటర్‌కు ఓనర్ అయ్యాడు. ఇప్పుడు అదే థియేటర్‌లో తాను నిర్మించిన సినిమాను రిలీజ్ చేసుకుంటున్నాడు.
ఆ అభిమాని మరెవరో కాదు.. ‘అనకాపల్లి’ సినిమా సహ నిర్మాత కాండ్రేగుల నాయుడు. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో తన సినీ ప్రయాణం గురించి ఆయన చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. తాను ప్రభాస్‌కు వీరాభిమానినని చెప్పిన నాయుడు.. ‘మిర్చి’ సినిమా తన జీవితంలో ఎలా ఓ టర్నింగ్ పాయింట్‌గా మారిందో వివరించారు.
2013లో ప్రభాస్ ‘మిర్చి’ రిలీజైన సమయంలో నాయుడు అనకాపల్లిలోని వెంకటేశ్వర థియేటర్‌కు కుటుంబంతో కలిసి వెళ్లారట. అయితే అప్పటికే సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండటంతో టికెట్లు దొరకలేదట. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టికెట్ కోసం ఎదురుచూసినా.. సినిమా చూడలేకపోయినట్లు నాయుడు గుర్తుచేసుకున్నారు.
అదే సమయంలో “ఎప్పటికైనా ఈ థియేటర్‌ను కొనాలి” అని నిర్ణయించుకున్నారట. అప్పటికి సాధారణ వ్యక్తిగా ఉన్న నాయుడు.. ఆ లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని ముందుకు సాగారు. రియల్ ఎస్టేట్ రంగంలో కష్టపడి ఎదిగిన తర్వాత చివరకు తాను అనుకున్నట్టుగానే ఆ థియేటర్‌ను కొనుగోలు చేశారు.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకప్పుడు టికెట్ కోసం క్యూ లైన్‌లో నిలబడిన నాయుడు.. ఇప్పుడు అదే థియేటర్‌కు ఓనర్. అంతేకాదు.. తానే నిర్మించిన ‘అనకాపల్లి’ సినిమాను అదే థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తనకు ఈ క్షణం ఎంతో సంతోషంగా ఉందని నాయుడు చెబుతున్నారు.
‘అనకాపల్లి’ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించారు. తారక్ పొన్నప్ప ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాణంలోనూ భాగమయ్యారు. నాయుడు కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం రిలీజ్.. షాకిచ్చిన నిర్మాత నాగవంశీ.!
[Prabhas Fan To Theatre Owner, Anakapalli Producer Naidu, Prabhas Mirchi Movie, Anakapalli Movie, Rebel Star Prabhas, Prabhas Fans, Telugu Film News, Telugu News]






