Home

»

Latest News

పాన్ ఇండియా సినిమా అప్పుడే ఉందా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!

Oct 1, 2026 12:50PM


ఈ మధ్య పాన్ ఇండియా అనే వర్డ్ ఎక్కువయ్యింది. ఎక్కువ అవ్వడమేముంది! ఎక్కువ అవ్వాలి కూడా.. అప్పుడే ప్రేక్షకులు అన్ని రకాల సినీ మజాని పొందుతారు. కాకపోతే పాన్ ఇండియా అని చెప్పుకునేటప్పుడు కొంత మంది మేకర్స్ మాటలు, చేష్టలు చూస్తే నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా తామే కనిపెట్టుగా చెప్తుంటారు. దీనిపై వంశపారంపర్య సినీ ప్రియులు నవ్వుకుంటూ 'నీలాంటి కథలు ఎన్నో చూసే ఇక్కడనున్నాం. మీరు చేస్తుంది ఇంకా చాలా తక్కువ. ఆ లిస్ట్ చూస్తే షాక్ అవుతారు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దాం.  

పాన్ ఇండియా ట్రెండ్ ఈ రోజుల్లో కొత్తగా ఊడిపడింది కాదు! దశాబ్దాల క్రితమే సరిహద్దులు దాటి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి. కాకపోతే అప్పట్లో ఈ పదబంధం లేకపోవడం, ప్రస్తుతం డిజిటల్ విప్లవం మరియు మార్కెటింగ్ హడావుడి విపరీతంగా పెరగడమే ఈ తేడాకు కారణమని చెప్పవచ్చు.చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే.. 1948లోనే జెమిని స్టూడియోస్ నిర్మించిన ‘చంద్రలేఖ’ చిత్రం భారతదేశం అంతటా రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. నాటి ప్రసిద్ధ నిర్మాత ఎస్.ఎస్.వాసన్ ఈ సినిమాను తమిళంతో పాటు హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేసి . 1.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశారు. 1940ల కాలంలోనే  60 లక్షల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం భారతీయ సినిమా మార్కెట్‌ను ఒక్కసారిగా విస్తరించింది. ఆ తర్వాత 1977లో వచ్చిన ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ ఉత్తరాది థియేటర్లలో విపరీతంగా అలరించి రూ. 3 కోట్లకు పైగా షేర్ సాధించి ఆ రోజుల్లోనే ట్రెండ్ సెట్ చేసింది. అలాగే 1989లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'నాయగన్' (తెలుగులో నాయకుడు), 1992లో వచ్చిన 'రోజా' వంటి చిత్రాలు దక్షిణ భారత్‌లోనే కాకుండా ఉత్తరాది ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకున్నాయి. 'రోజా' సినిమా కేవలం రూ. 25 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లకు పైగా వసూలు చేసి సరిహద్దుల్లేని సినిమా సత్తాను చాటిచెప్పింది.   అయితే 2015 వరకు ఈ తరహా చిత్రాలను 'బహుభాషా చిత్రాలు' లేదా 'డబ్బింగ్ సినిమాలు' అని పిలిచేవారు. కానీ 2015లో దర్శకుధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాతో కథ ముఖచిత్రమే మారిపోయింది. 


ఇది చదవండి: 10 ఏళ్ళ తర్వాత సంచలన ట్విస్ట్:  చిన్నారి పెళ్లి కూతురు ప్రత్యుష కేసులో తీర్పు..  ప్రియుడే హంతకుడా!

 

 

180 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన 'బాహుబలి 1' ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లు సాధిస్తే, 2017లో వచ్చిన 'బాహుబలి 2' ఏకంగా రూ. 1780 కోట్లకు పైగా వసూలు చేసి భారతీయ సినిమా స్థాయిని ఆకాశానికి ఎత్తింది. దాంతో 'పాన్ ఇండియా' అనే పదం ఒక్కసారిగా గ్లోబల్ బ్రాండ్‌గా రూపాంతరం చెందింది. దీనిని అనుసరిస్తూ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్: ఛాప్టర్ 2' 1250 కోట్లకు పైగా వసూలు చేయగా, 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం  1300 కోట్లకు పైగా వసూళ్లతో ఆస్కార్ వేదికపై నాటు నాటుతో మెరిసింది.   మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి? అంటే ప్రధానంగా కార్పొరేట్ ప్రమోషన్లు, మల్టీప్లెక్స్ నెట్‌వర్క్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వ్యాప్తి. 


అప్పట్లో ఒక సినిమా వేరే భాషలోకి వెళ్లాలంటే నోటి మాట ప్రచారం లేదా పరిమిత థియేటర్ల విడుదల మాత్రమే ఆధారం. కానీ నేడు డిజిటల్ మార్కెటింగ్ మరియు ప్రమోషన్ల హడావుడితో సినిమా విడుదల కాకముందే కోట్లాది మందికి చేరువవుతోంది. ఏది ఏమైనా, కథలో దమ్ముంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని దశాబ్దాల చరిత్ర స్పష్టం చేస్తోంది!  

 

 

[Pan India Movies History, indian cinema evolution, Chandraleka, baahubali box office record, tollywood pan india trend, ss rajamouli films, south indian cinema footprint, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]
 
    


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com