Home

»

Latest News

ప్రభాస్ రెబెల్ న్యూస్

Jun 10, 2011 7:42PM

ప్రభాస్ "రెబెల్" న్యూస్ ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే బాలాజీ సినీ మీడియా పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, "వేదం" ఫేం దీక్షా సేథ్ హీరోయిన్ గా, కొరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, జె.పుల్లారావు, జె.భగవాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ బేస్డ్ ఎంటర్ టైనర్ ఫిలిం "రెబెల్". ఈ ప్రభాస్ "రెబెల్" సినిమాకి ఆకాశ్ -విశాల్ అనే ముంబాయి ఫైటర్స్ తో హీరో ప్రభాస్ పోరాడే సన్నివేశాలను ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసొడ్స్ ని గత రెండు వారాలుగా భారీగా చిత్రీకరిస్తున్నారు.

ప్రభాస్ "రెబెల్" సినిమాకి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. యస్.యస్.తమన్ ఈ ప్రభాస్ "రెబెల్" సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటించగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన "మిస్టర్ పర్ ఫెక్ట్" సినిమా ఇటీవల రిలీజై ఘనవిజయం సాధించి, 130 సెంతర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని, విజయవంతంగా ప్రదర్శించబడుతూంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com