Home

»

Latest News

నాగచైతన్య ఆటోనగర్ సూర్యలో నిత్యమీనన్

Jun 10, 2011 6:58PM

నాగచైతన్య "ఆటోనగర్ సూర్య" లో నిత్యమీనన్ హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయ వర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, యువహీరో నాగచైతన్య హీరోగా, విభిన్న చిత్రాల దర్శకుడు "ప్రస్థానం" ఫేం దేవకట్టా దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న సినిమా "ఆటోనగర్ సూర్య". తన తొలి చిత్రం "అలా మొదలయ్యింది" సినిమా ద్వారా ఆంధ్రప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న పొట్టి కేరళ కుట్టి నిత్య మీనన్ "ఆటోనగర్ సూర్య" సినిమాలో హీరోయిన్ గా ఎన్నికైంది.

నాగచైతన్య "ఆటోనగర్ సూర్య" సినిమాకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు వ్రాస్తుండగా, దర్శకుడు దేవకట్టా సంభాషణలు కూడా వ్రాయటం విశేషం. నాగచైతన్య "ఆటోనగర్ సూర్య" సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్నందిస్తున్నారు. నాగచైతన్య "ఆటోనగర్ సూర్య" సినిమాకి శ్రికాంత్ నర్రోజ్ సినిమాటోగ్రఫీని నిర్బహిస్తున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని రౌడీయిజం బేస్ చేసుకుని ఈ నాగచైతన్య "ఆటోనగర్ సూర్య" చిత్ర కథని తయారుచేసినట్లు సమాచారం. అతి త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు రానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com