
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియడ్ డ్రామా 'పవర్‌పేట' (Powerpeta). కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి సందీప్ కిషన్ పుట్టినరోజు (మే 7) సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఈ గ్లింప్స్‌లో సందీప్ కిషన్ లుక్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఆయన 'సేనాపతి రవి' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. "అడవిలో సింహం ఉ** పోసి ఇది నా చోటు అని చెప్తుంది. ఇక్కడ ఉ** పోయిస్తే గానీ ఈ చోటు నీది కాదు" అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తున్నాయి.
సందీప్ కిషన్ టపాసులతో థియేటర్ లోకి ఎంటరై అందరినీ భయపెట్టడం, స్క్రీన్ ని తగలబెట్టడం, దాని మీద 'పవర్‌పేట' అని టైటిల్ పడటం ఆకట్టుకుంది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ విజువల్స్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని స్పష్టం చేస్తున్నాయి. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన బలం అని చెప్పొచ్చు.
70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య మార్క్ డైలాగ్స్, పొలిటికల్ అండ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రేమ, గౌరవం, రాజకీయం (Love, Honour, Politics) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాలో సందీప్ కిషన్ మూడు భిన్నమైన వయసు గల పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ బర్త్ డే గ్లింప్స్ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది.





