Home

»

Latest News

VIJay: విజ‌య్‌పై పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అన‌వ‌స‌రంగా న‌న్ను రోడ్డు మీద‌కు లాగొద్దు

May 07, 2026

 

నేడు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) తన కొత్త సినిమా 'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రెస్ మీట్ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు, తన వ్యక్తిగత జీవితం మరియు తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్  పార్టీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఎందుకు  ఆహ్వానించడం లేదు.  విజయ్‌(VIjay)ని సీఎం కాకుండా అడ్డుకోవడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. ఆయన్ని కురుక్షేత్రంలోని అభిమన్యుడిలా పద్మవ్యూహంలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విజయ్ నాకు 1996 నుండి తెలుసని, ఆయన ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారని,  అధికారం కోసం ఆశపడే వ్యక్తి కాదని కొనియాడారు.  

Also read: Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య  కావ్య రెడ్డి చేసే బిజినెస్ ఇదేనా! 

 చాలా కాలం తర్వాత  ఆపరేషన్ అరుణారెడ్డి చేస్తున్నాను. నేనే ద‌ర్శ‌కుడ్ని  ఒక నిజాయితీపరుడైన జర్నలిస్ట్ కథ ప్రస్తుత సమాజంలో నిజాయితీగా ఉంటే ఎవరూ మెచ్చుకోరని, బలం ఉన్న దొంగలే గొప్పవాళ్లవుతున్నారు. నన్ను ప్రశాంతంగా సినిమాలు చేసుకోనివ్వండి, అనవసరంగా రోడ్డు మీదకు లాగొద్దు. న‌న్ను ఎవరైనా తిడితే మాత్రం గట్టిగా రియాక్ట్ అవుతానని హెచ్చరించారు. పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు  సినీ వర్గాల్లోనూ,రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి..

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com