Home

»

Latest News

పవన్ నా టైమంతా వేస్ట్ చేస్తున్నాడు..?

Sep 10, 2016 12:49PM

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఒక అలవాటు ఉంది. ఆయన ఒక సినిమాలో తనతో నటించిన హీరోయిన్లను మరోసారి రీపిట్ చేయ్యడు. తొలి సినిమా నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నాడు. కెరిర్‌లో ఒక్కరి విషయంలో మాత్రమే అది రిపీట్ చేశాడు. తన మాజీ భార్య రేణూదేశాయ్‌కి మాత్రమే ఆ ఛాన్సిచ్చాడు పవన్. బద్రీ, జానీ సినిమాల్లో రేణు పవన్ సరసన నటించారు. ఆ తర్వాత మరేవ్వరికి అలాంటి అవకాశం రాలేదు. అయితే శృతిహసన్‌కు ఆ అదృష్టం పట్టింది. గబ్బర్‌సింగ్‌లో పవన్‌తో మొదటిసారి జోడి కట్టిన శృతి, లేటేస్ట్‌గా డాలీ దర్శకత్వంలో పవర్‌స్టార్ నటిస్తున్న కాటమరాయుడు సినిమాతో మరోసారి ఆయనతో ఆడిపాడే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఇప్పుడు ఆ సినిమా నుంచి బయటకొచ్చేస్తానంటోందట శృతి.

దీనికి కారణం లేకపోలేదు. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన వెంటనే పవన్ రాజకీయాల్లో బిజీగా మారారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో మిగిలిన వారితోనే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి పవన్‌ కోసం ఎదురు చూస్తున్నాడు డాలీ. ఇంకోవైపు వేరే సినిమాలను కూడా కాదనుకుని పవన్ చిత్రం కోసం వెయిట్ చేస్తోందీ శృతీహాసన్. తాజాగా తన డేట్స్‌ వేస్ట్ అయిపోతున్నాయని నిర్మాత శరత్ మరార్ దగ్గర ఆమె బాధపడినట్లు సమాచారం. ఇలాగే అయితే తాను సినిమా నుంచి తప్పుకుంటానని తేల్చిచెప్పినట్టు కూడా ఫిలింనగర్‌లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి శృతి బాధను అర్థం చేసుకునైనా పవన్ త్వరగా షూటింగ్‌లో జాయిన్ అవుతారో లేదో వేచి చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com