Home

»

Latest News

'బిజినెస్‌మేన్' నిర్మాత‌.. ఆర్ఆర్‌ మూవీ మేకర్స్ వెంకట్ క‌న్నుమూత‌

Sep 27, 2021 9:47AM

 

తెలుగులో ప‌లు హిట్ చిత్రాల‌తో పాటు, హాలీవుడ్‌లో డివోర్స్ ఇన్విటేష‌న్ అనే మూవీని నిర్మించిన ఆర్‌.ఆర్‌. మూవీ మేక‌ర్స్ అధినేత జె. వెంక‌ట ఫ‌ణీంద్రరెడ్డి అలియాస్ వెంక‌ట్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో మృతి చెందారు. కొంత కాలంగా మూత్ర‌పిండాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ ఈరోజు వేకువ జాము 5:30 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. టాలీవుడ్‌లో వెంక‌ట్‌గా ఆయ‌న పాపుల‌ర్‌. 

తెలుగులో ది ఎండ్, సామాన్యుడు, మాయాజాలం, హంగామా, గుండమ్మగారి మనవడు, బహుమతి, కిక్, ప్రేమ కావాలి, డాన్ శ్రీను, పైసా, ఢమరుకం, బిజినెస్‌మేన్, లవ్లీ, విక్టరీ చిత్రాల‌ను ఆయ‌న నిర్మించారు. వీటిలో రెండు మూడు మిన‌హా మిగ‌తావ‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌యం సాధించిన‌వే. అలాగే ఎస్వీ కష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన 'ఆహ్వానం' చిత్రాన్ని ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే హాలీవుడ్‌లో 'డివోర్స్ ఇన్విటేషన్' (2012) టైటిల్‌తో రీమేక్ చేశారు. ఈ మూవీలో జోనాథ‌న్ బెనెట్‌, జేమీ లిన్ సిగ్ల‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లు ధరించారు.

వెంక‌ట్ ఆక‌స్మిక మృతి ప‌ట్ల ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు దిగ్భ్రాంతి వ్య‌క్తంచేస్తూ, సంతాపం తెలిపారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com