Home

»

Latest News

మోడీ ఎఫెక్ట్: అప్పులు చేస్తోన్న హీరోయిన్లు

Nov 10, 2016 12:02PM

దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు నల్లధనానికి అడ్డుకట్టే వేసే చర్యల్లో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 500, 1000 నోట్లు ఇక చెల్లవని..పాత వాటిని బ్యాంకుల్లో మార్చుకోవాలసిందిగా ఆయన ప్రజలకు సూచించారు. ఈ నిర్ణయం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కానీ దేశ శ్రేయస్సు దృష్ట్యా సహకరించాని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోడీ ప్రకటన వెలువరించిన తర్వాత గంట నుంచి దేశ వ్యాప్తంగా 500, 1000 నోట్ల చెలామణి నిలిచిపోయింది.

వ్యాపారస్తులు ఆ నోట్లను అంగీకరించకపోవడంతో ప్రజలు అల్లాడిపోయారు. దీని ప్రభావం సామాన్యులతో పాటు సెలబ్రిటీలపైనే పడింది. నిత్యావసరాల నిమిత్తం తగినంత చిల్లర లేకపోవడంతో పలువురు పలువురు హీరోయిన్లు అప్పులు చేస్తున్నారు. బ్లాక్‌బ్యూటీ బిపాసా బసు కోడిగుడ్లు కొనుక్కోవడానికి చిల్లర లేక, తన స్నేహితుడు మరియు ఫ్యాషన్ డిజైనర్ రాకీస్టార్ నుంచి చిల్లర అప్పు తీసుకుందట, తనకు ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదని బిపాసా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com