Home

»

Latest News

నోట్ల రద్దు గురించి చెప్పిన సినిమాలు

Nov 10, 2016 9:59AM

నల్లధనాన్ని కట్టడి చేయడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. దేశంలోని ప్రధాన సమస్యలను టార్గెట్‌ చేస్తూ చాలా సినిమాలు వచ్చాయి. ఎన్ని సమస్యలు ఉన్నా మన సినిమా వాళ్ల ఫోకస్ మాత్రం ముఖ్యంగా అవినీతి, నల్లధనంపైనే. కొన్ని సినిమాల్లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని హీరోల చేతనో..పాత్రల ద్వారానో చెప్పించి జనాల్ని ఆలోచింపచేశారు దర్శకులు. ఇప్పుడు ఆ ఆలోచనను నిజం చేసి దేశం మొత్తం నోట్ల గురించి మాట్లాడేలా చేశారు ప్రధాని. 

 

ప్రతినిధి:

నారా రోహిత్ నటించిన ఈ సినిమాలో హీరో ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి ఆయనతో పలికే సంభాషణలు ఆలోచింపచేస్తాయి. అధికారం.. అధికారం..అధికారం.. ఏముందిరా. ఇందులో.. చుట్టూ పదిమంది సెక్యూరిటీ, ఉదయాన్నే ఇంటిచుట్టూ వందమంది కార్యకర్తలు.. సొసైటీలో పలుకుబడి.. తప్పుచేస్తే కప్పిపుచ్చుకునే సమర్థత... లేకపోతే ట్రాఫిక్‌ లేకుండా ఇంటికి వెళ్ళడం. దీనికోసం దేశాన్ని శ్మశానం చేస్తార్రా అంటూ ఆవేశంగా పలుకుతాడు. దానితో పాటే వెంటనే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తాడు.

 

బిచ్చగాడు:

రీసెంట్‌గా తెలుగు తెరను ఒక ఊపు ఊపి డబ్బింగ్ చిత్రాల చరిత్రలోనే కొత్త ట్రెండ్ సెట్ చేసిన బిచ్చగాడులోనూ 1000, 500 నోట్ల ప్రస్తావన వచ్చింది. ఓ బిచ్చగాడు ఎఫ్.ఎం స్టేషన్‌కి ఫోన్ చేసి ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి గురించి పెద్ద లెక్చర్ ఇచ్చేస్తాడు. అప్పుడు దేశం బాగుపడాలంటే ఏం చేయాలి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు..రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తే దేశం బాగుపడుతుందంటూ సమాధానం చెబుతాడు ఆ బిచ్చగాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com