Home

»

Latest News

'పినాక' టీజర్ రివ్యూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో పాన్ ఇండియా వండర్.!

Jul 6, 2026 4:58PM

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడ చలనచిత్ర పరిశ్రమలోకి అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగుపెడుతూ నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'పినాక'. గోల్డెన్ మెగాస్టార్ గణేష్ సరికొత్త లుక్‌లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బి. ధనంజయ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన 90 సెకన్ల నిడివి గల హై-వోల్టేజ్ టీజర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఒక సరికొత్త ఆధ్యాత్మిక, యుద్ధ ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. ఈ టీజర్‌లో దర్శకుడు బి. ధనంజయ్ చూపించిన విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. టీజర్ ప్రారంభంలో ‘శివనామస్మరణ’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఒక అద్భుతమైన డివైన్ కింగ్‌డమ్‌ను పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకుడిని కథలోకి లీనం చేస్తుంది. శివుడి భారీ విగ్రహం, ప్రాచీన సామ్రాజ్యాల సెట్టింగ్స్ విజువల్స్ పరంగా ఎంతో రిచ్‌గా ఉన్నాయి.

కథలోకి వెళ్తే, ఒకవైపు దైవత్వం ఉట్టిపడే సామ్రాజ్యం కనిపిస్తుంటే, మరోవైపు చీకటి శక్తుల ఎదుగుదల, అలాగే ఒక భయంకరమైన రహస్యాన్ని టీజర్‌లో చూపించారు. ఈ రెండు శక్తుల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా ముఖ్య కథాంశం అని అర్థమవుతోంది. కాలాలను దాటి సాగే యుద్ధం (A War Across Ages) అనే క్యాప్షన్ ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ను వివరిస్తోంది. విధి అతడిని ఎంచుకుంది (Destiny Chooses Him) అంటూ హీరో గణేష్ ఎంట్రీ ఇచ్చే సీన్ ఆకట్టుకుంది. 'ధర్మ రక్షణ కోసం సాగే యుద్ధం' అనే లైన్‌తో టీజర్ ముగియడం సినిమాపై మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఈ చిత్రంలో రెండు భిన్నమైన కాలాల మధ్య జరిగే మిస్టరీని దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే సుమారు 40 నుండి 45 నిమిషాల నిడివి గల ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కథకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ భారీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గౌర హరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్స్ టీజర్‌కు అదనపు బలాన్ని చేకూర్చాయి. గణేష్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, రంగాయణ రఘు, ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో మెరవనున్నారు.

ఈ మైథలాజికల్ వండర్ ను అక్టోబర్ 2, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీజర్ లోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ఇప్పటికే నెటిజన్ల నుండి భారీగా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం కాస్ట్యూమ్ డిజైన్స్, కొన్ని సీన్స్ పాత సినిమాలను గుర్తుచేసేలా ఉన్నాయంటూ చిన్నపాటి విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మొదటి కన్నడ పాన్ ఇండియా ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Pinaka Teaser, Golden Megastar Ganesh, People Media Factory, B Dhananjaya, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com