Home

»

Latest News

భయపడితే మాకు సంబంధం లేదు.. ఓటిటిలో దుమ్ము రేపుతున్న హర్రర్ క్రైమ్ థ్రిల్లర్

Jun 6, 2026 2:51PM

 


సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ని చూస్తూ ఉంటే వచ్చే మజానే వేరు. సదరు జోనర్ ని ఇష్టపడే ప్రియులైతే సినిమాలన్నీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కధాంశంతో వస్తే ఎంత బాగుండని అనుకుంటూ ఉంటారు. కన్నడ ఇండస్ట్రీ నుండి రీసెంట్‌గా థియేటర్లలోకి అలాంటి ఒక మూవీనే రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీనే 'పీటర్'. 

ఇప్పుడు ఈ మూవీ జూన్ 4 నుంచి  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో  స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఏప్రిల్ 10న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, కేవలం రెండు నెలల లోపే డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమవ్వడం విశేషం. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDb) లో ఈ చిత్రానికి ఏకంగా 9.2/10 రేటింగ్ లభించడంతో మూవీపై నెట్టింట భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

 సుకేష్ శెట్టి దర్శకత్వం వహించగా, వృద్ధి స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సంచలన చిత్రాలను పంపిణీ చేసిన 'KVN ప్రొడక్షన్స్' సంస్థ  డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలని తీసుకోవడం వల్ల   థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైంది.  రాజేష్ ధ్రువ, జాన్వీ రాయల, రవిక్ష శెట్టి ప్రధాన పాత్రల్లో అద్భుతమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే ఒక వ్యక్తి జీవితం ఎలా మారుతుంది అనే బలమైన రివేంజ్ పాయింట్‌కు, గూస్‌బంప్స్ తెప్పించే హారర్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు సుకేష్ శెట్టి ఈ కథను వెండితెరపై ఆవిష్కరించిన విధానం  కట్టిపడేస్తుంది.


Also read: Devi sri prasad: నా జీవితంలో మళ్లీ రాని అద్భుతమైన అవకాశం.. క్రేజీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ పై దేవిశ్రీ ప్రసాద్‌

 విజువల్స్ పరంగా కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. సహజత్వం కోసం  కర్ణాటకలోని ప్రసిద్ధ కొడగు (కూర్గ్) జిల్లాకు చెందిన మడికేరి, భాగమండల పరిసరాల్లోని దట్టమైన అడవులు, మంచు కొండల మధ్య  షూట్ చేశారు. ఆ లోకేషన్స్ సినిమాలోని సస్పెన్స్ మరియు భయానక వాతావరణాన్ని మరింత పెంచాయి. కొన్ని హారర్ సీన్స్ అయితే థియేటర్లలో ఆడియెన్స్ ని  నిజంగానే భయపెట్టాయి. క్రైమ్ మరియు హారర్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో  'పీటర్' ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com