Home

»

Latest News

Peddi: 'పెద్ది' ర్యాంపేజ్ స్టార్ట్.. నార్త్ అమెరికాలో సంచలన రికార్డు సృష్టించిన రామ్ చరణ్!

May 08, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని అప్పుడే మొదలుపెట్టింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ, ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా నార్త్ అమెరికాలో ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'పెద్ది' సినిమా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.

రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'RRR' తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనికి నిదర్శనంగా నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే 'పెద్ది' ఊహించని రీతిలో స్పందనను రాబట్టింది.

నార్త్ అమెరికాలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సినిమా $100K (ఒక లక్ష డాలర్లు) మార్కును చేరుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. బుకింగ్స్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లోనే $50K పైగా వసూలు చేసి తన 'ర్యాంపేజ్'ను చాటిచెప్పింది. ప్రత్యంగిర సినిమాస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. జూన్ 3న నార్త్ అమెరికా అంతటా గ్రాండ్ ప్రిమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి.

1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ఇది. ఇందులో రామ్ చరణ్ విభిన్నమైన లుక్‌లో పహిల్వాన్ గా కనిపించనున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బొమ్మన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

టాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసే దిశగా 'పెద్ది' దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్‌ను చూస్తుంటే, విడుదల సమయానికి ఈ సినిమా మరిన్ని రికార్డులను కొల్లగొట్టడం ఖాయమనిపిస్తోంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com