Home

»

Latest News

Arjun Das: సీక్రెట్‌గా అర్జున్ దాస్ ఎంగేజ్‌మెంట్?

May 27, 2026 3:23PM

కోలీవుడ్, టాలీవుడ్‌లలో తన గాంభీర్యమైన వాయిస్, విలక్షణమైన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు అర్జున్ దాస్ (Arjun Das). అయితే గత కొన్ని గంటలుగా సోషల్ మీడియా వేదికగా అర్జున్ దాస్‌కు సంబంధించిన ఒక వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అర్జున్ దాస్ ఈ వారం అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

ఈ పుకార్లు కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అర్జున్ దాస్ టీమ్ రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ ఎంగేజ్‌మెంట్ పోస్టులపై, పెళ్లి వార్తలపై పూర్తి స్థాయిలో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. అర్జున్ దాస్ నిశ్చితార్థం, పెళ్లి వార్తలలో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ కేవలం బేస్ లెస్ రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పింది.

ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని, ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే అర్జున్ దాస్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అభిమానులతో పంచుకుంటారని టీమ్ పేర్కొంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com