Home

»

Latest News

Peddi: గ్లింప్స్ లోని ఆ డైలాగ్ లో తప్పు ఉంది! లేక ఏదైనా లాజిక్ ఉందా!

Mar 27, 2026

 

-రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న గ్లింప్స్
-ఫ్యాన్స్ లో అంతకంత పెరిగిన అంచనాలు 
-గ్లింప్స్ లోని ఒక డైలాగ్ పై డౌట్ 

 
ఈ రోజు తొమ్మిది గంటల నలభై నిమిషాలకి శ్రీరామనవమి(Srirama Navami)చరణ్ బర్త్ డేకి వెల్ కమ్ చెప్తు 'పెద్ది'(Peddi)గ్లింప్స్ సినీమార్కెట్ లోకి అడుగుపెట్టబోతుందని మేకర్స్ అనౌన్స్ చేసారు. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ మొత్తం ఆ టైంకి తమ పనులన్నీ పక్కన పెట్టి పెద్ది ఆగమనం కోసం కోదండాన్ని చేతబూనిన శ్రీరామచంద్రుడులా ఫోన్స్ ని చేతబూని వెయిట్ చేసారు. ఇక పెద్ది తాను నిర్ణయించుకున్న ముహూర్తానికి కొంచం అటు ఇటుగా అడుగుపెట్టినా గ్లింప్స్ చూసిన వాళ్లంతా ఆహా ఏమి ఆ దర్శన భాగ్యం అని మురిసిపోతున్నారు. ఏప్రిల్ 30 న సెల్యులాయిడ్ పై పెద్ది ప్రళయం పక్కా అని ఫిక్స్ కూడా  అయ్యారు. అదే టైంలో గ్లింప్స్ లోని ఒక డైలాగ్ వాళ్లందరిలో సరికొత్త చర్చకి దారి తీసింది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

 గ్లింప్స్ స్టార్టింగ్ లో పెద్దిని ఉద్దేశించి ఒక వాయిస్ ఓవర్ మాట్లాడుతు 'బంతితో బాట్ కి ఎదురెళ్ళే ఆట కాదురా ఇది. పాణంతో చావుకి ఎదురిల్లే ఆట అని వచ్చింది. ఇప్పుడు ఈ డైలాగ్ పైనే అభిమానులు, మూవీ లవర్స్ మాట్లాడుతు సాధారణంగా బాట్ తో బంతికి ఎదురెళ్ళడం అనే పదాన్ని వాడతారు కదా! పైగా గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ లో పెద్ది క్రికెట్ ఆటగాడిగా కనపడి బౌలర్ వేసిన బంతిని బాట్ తో దిమ్మ తిరిగి పోయేలా కొడతాడు. మరి ఆ లెక్కన చూసుకున్నాబాట్ తో బంతికి ఎదురెళ్ళాడమే కదా అనేదని వాళ్ళ పాయింట్. మరి పెద్ది టీం ఈ విషయాన్నీ గమనించలేదా! లేక ఇంకేమైనా లాజిక్ ఉందా అనేది తెలియాలి. 

also read: Peddi: పెద్ది గ్లింప్స్ రిలీజ్.. స్పష్టంగా తెలుస్తున్న పెద్ది పొగరు 

గ్లింప్స్ రిలీజైన నిమిషాల్లోనే సునామి కూడా సిగ్గుతో తలవంచుకునే వ్యూస్ తో దూసుకుకెళ్తుంది. కాబట్టి ఎక్కువ మంది సదరు డౌట్ ని వ్యక్త పరిచే అవకాశం ఉంది. దీంతో పెద్ది టీం స్పందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com