నెక్స్ట్ లెవల్లో హంగ్రీ చీతా ‘ఒజి’ గ్లింప్స్.. ఇక ఫ్యాన్స్‌కి పండగే!
on Sep 2, 2023
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఒజి’ గ్లింప్స్ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజున విడుదల చేశారు మేకర్స్. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించారు. ఈ వీడియో చూస్తుంటే ‘ఒజి’ కోర్ బ్లడెడ్ మూవీగా తెలుస్తోంది. ఇంతకుముందెన్నడూ అంత రక్తపాతంలో పవన్ కల్యాణ్‌ని చూడలేదు. హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ సినిమా రూపొందుతోందని ప్రతి ఫ్రేమ్ తెలియజేస్తోంది. సుజీత్ ఎంతో కేర్ తీసుకొని ప్రతి షాట్‌ని తీశాడు. ఇక థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు.
‘పదేళ్ళ క్రితం ముంబైలో వచ్చిన తుఫాన్ గుర్తుందా.. అది మట్టి, చెట్లతోపాటు సగం ఊరుని ఊడ్చేసింది. కానీ, వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం.. ఇప్పటికీ ఏ తుఫాన్ కడగలేకపోయింది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే...’ అంటూ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయ్యే ఈ గ్లింప్స్‌లోని విజువల్స్ ఎంతో ఎఫెక్టివ్‌గా ఉండడంతోపాటు ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించేలా వుంది. పవన్‌కళ్యాణ్‌లోని పవర్‌ని సుజిత్ హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్నాడా అన్నట్టుగా విజువల్స్‌ను అదిరిపోయేలా తీశాడు. సినిమాలో వయెలెన్స్ శాతం ఎక్కువేనని ఈ చిన్న వీడియో ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు పవన్‌కళ్యాణ్‌ని ఏ సినిమాలోనూ ఇంత వయొలెంట్‌గా చూడలేదనేది వాస్తవం. మొత్తానికి పవర్‌స్టార్ బర్త్‌డేకి ఒక పవర్ఫుల్ గ్లింప్స్‌తో ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చారు ‘ఒజి’ మేకర్స్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
