అడ్వాన్స్ టికెట్స్ క్యాన్సిల్.. వెబ్‌సైట్స్ నుంచి ‘సలార్’ తొలగింపు!
on Sep 2, 2023
గత కొన్ని గంటలుగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’ వాయిదా పడిరదంటూ వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందీ అనే విషయంలో చర్చ జరిగింది. అయితే ఆ వార్త నిజమేనని కొన్ని ఘటనలు తెలియజేస్తున్నాయి. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాకి వరల్డ్‌వైడ్‌గా చాలా హైప్ ఉంది. దాదాపు నెల రోజుల ముందే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. దీంతో టిక్కెట్ల అమ్మకాలు కూడా భారీగానే జరిగాయి. ఈ సమయంలో సినిమా వాయిదా పడిరదంటూ వార్తలు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అందులో నిజం లేదేమోనని అభిప్రాయపడ్డారు. కానీ, ఓవర్సీస్‌లో సేల్స్ జరిగిన టిక్కెట్ల ఎమౌంట్‌ను తిరిగి చెల్లిస్తున్నారని తెలిసింది. అంతే కాదు టిక్కెట్ల బుకింగ్‌కి సంబంధించిన వెబ్‌సైట్ నుంచి ‘సలార్’ చిత్రాన్ని తొలగించారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో షారూఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’కి ఏమాత్రం తగ్గకుండా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. యుఎస్ లో 19,000 టిక్కెట్లు సేల్ అయ్యాయి. సినిమా రిలీజ్‌కి 26 రోజుల ముందే 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది ‘సలార్’. ఇంకా వివిధ దేశాల్లో కూడా భారీగానే టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా టిక్కెట్స్ సేల్ అయ్యాయని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలియజేస్తోంది. అయితే సినిమా వాయిదా పడిరదనే విషయాన్ని ఇప్పటివరకు మేకర్స్ ప్రకటించలేదు. ఈరోజు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



