Home

»

Latest News

వైరల్ అవుతున్న పవన్ 'ఉస్తాద్' లుక్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

Aug 21, 2023 3:37PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఇట్టే ఖుషి అయిపోతుంటారు. అలాంటిది ఓ కిరాక్ లుక్ రిలీజైతే.. పండగన్నమాట కూడా చిన్నదైపోతుంది. ప్రస్తుతం పవన్ అభిమానులది ఇదే పరిస్థితి. 

వివరాల్లోకి వెళితే.. స్వల్ప విరామం అనంతరం పవన్ కళ్యాణ్, అతని మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అదే.. 'ఉస్తాద్ భగత్ సింగ్'. బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' అనంతరం హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ కాప్ స్టోరీ.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఆ మధ్య ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి తాత్కాలికంగా బ్రేక్ పడనున్నట్లు వార్తలు వచ్చాయి. వీటికి తెరదించుతూ..  'ఉస్తాద్' సెట్ లో పవన్ తో అలా నడుచుకుంటూ వస్తున్న ఫొటోని షేర్ చేశారు ఆనంద్ సాయి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పవన్ కిరాక్ లుక్ కి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. 

ఇదిలా ఉంటే, పవన్ ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు 'ఓజీ', 'హరిహర వీరమల్లు' చేస్తున్నారు. వీటిలో ముందుగా 'ఓజీ' తెరపైకి వచ్చే అవకాశముంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com