ENGLISH | TELUGU  

500 కోట్ల క్లబ్ లో 'జైలర్'.. లాభం రూ. 100 కోట్ల పైమాటే!

on Aug 21, 2023

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం 'జైలర్' ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా.. రూ. 500 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరి మరోసారి వార్తల్లో నిలిచింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఆగస్టు 10న జనం ముందు నిలిచింది. తొలి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆదివారంతో 11 రోజుల ప్రదర్శన చేసుకున్న ఈ సెన్సేషనల్ మూవీ.. ఇప్పటివరకు రూ. 103 కోట్లకి పైగా లాభాలు ఆర్జించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆదివారంతో రూ. 69.60 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది.  

'జైలర్' 11 రోజుల కలెక్షన్స్ వివరాలు:

తమిళనాడు – రూ. 148.80 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు - రూ. 69.60 కోట్ల గ్రాస్ (తమిళ వెర్షన్ తో కలిపి)
కర్ణాటక- రూ. 58.80 కోట్ల గ్రాస్
కేరళ – రూ. 45.90 కోట్ల గ్రాస్
రెస్టాఫ్ ఇండియా – రూ. 11.90 కోట్ల గ్రాస్
ఓవర్సీస్ – రూ. 170.40 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల కలెక్షన్స్  – రూ. 505.40 కోట్ల గ్రాస్ (రూ. 247.45 కోట్ల షేర్)

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.