Home

»

Latest News

పవన్ మాత్రమే కాదు... ప1 కూడా! 

Sep 2, 2016 10:24AM

 

సినిమాల్లో నటిస్తే నటుడైపోవచ్చు! హిట్ సినిమాలు ఖాతాలో పడితే స్టార్ అవ్వొచ్చు! బ్లాక్ బస్టర్స్ కూడా తోడైతే సూపర్ స్టార్ అవ్వొచ్చు! కాని, సినిమాలు, హిట్స్, బ్లాక్ బస్టర్స్... ఇలాంటివి వున్నంత మాత్రాన పవర్ స్టార్ అవ్వటం కుదరదు! అందుకు, సూపర్ స్టార్ ఇమేజ్ కు మించిన మరేదో అట్రాక్షన్ కావాలి! ఆ ఎక్స్ ఫ్యాక్టర్ మాత్రమే మామూలు స్టార్ ని పవర్ స్టార్ చేస్తుంది.... 

పవర్ స్టార్ గురించి మరీ గొప్పగా మాట్లాడితే ఆయన్ని పొగడటానికి అనుకోవటం సహజమే! కాని, నిజంగా కూడా పవర్ స్టార్ మిగతా స్టార్స్ కంటే భిన్నం. అందుకే, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ అనే మేనియా రొటీన్ గా సూపర్ హిట్ చిత్రాల కారణంగా పుట్టింది కాదు. అసలు పవన్ కెరీర్లో ఇప్పటి వరకు వున్న హిట్స్ తక్కువే. ఇక బ్లాక్ బస్టర్స్ అయితే ఇంకా తక్కువ... 

ఒక తొలిప్రేమ, ఒక గబ్బర్ సింగ్, ఒక అత్తారింటికి దారేది... ఇలా పవన్ కెరీర్లో కాసుల పంట పండించిన చిత్రాలు చకచకా చెప్పేయొచ్చు! అందుకు ప్రతిగా జనాల్ని, నిర్మాతల్ని, డిస్ట్రిబ్యూటర్లని అందర్నీ నిరాశపరిచిన ప్లాప్స్ కూడా చెప్పుకోవచ్చు! జానీ నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ దాకా ఎన్నెన్నో!

పవన్ ప్లాపుల గురించి ఎవరో మాట్లాడటం కాదు... స్వయంగా తానే పదేళ్లపాటూ నాకు సక్సెస్ లేదని చెప్పుకున్నాడు! అయినా ఆయనకున్న ఫాలోయింగ్ అందర్నీ విస్మయపరచటానికి కారణం ఏంటి? ఇన్ ఫ్యాక్ట్, పవన్ తనకు ఫ్లాప్స్ ఎదురయ్యాయని ఒప్పుకోవటమే ఆయన పవర్ స్టార్ స్టేటస్ కి సీక్రెట్ అనుకోవాలి! 

నాకు పెద్దగా యాక్టింగ్ రాదు. వచ్చిన పరిమితమైన యాక్టింగ్ తోనే సినిమాలు చేస్తుంటాను. ఇది కూడా పవన్ చెప్పుకున్న మాటే. ఇలా తన గురించి తాను నిజాయితీగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా మాట్లాడుకోవటమే పవన్ ప్రత్యేకత! అదే గొప్పతనం! అవును... తాను గొప్పోడ్ని కాదని ఒప్పుకోవటమే పవన్ గొప్పతనం! ఎట్ లీస్ట్ ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కి అతనిలో నచ్చేది అదే....

పవన్ మెగా బ్రదర్ గా వచ్చాడు. కాని, ఇప్పుడు అతను మెగా బ్రదర్ గా మిగిలిపోలేదు. పవనిజమ్ అనే తెగకి నాయకుడయ్యాడు. అఫ్ కోర్స్, చిరు ఫ్యాన్స్ అతడ్ని ఎలాగూ అభిమానిస్తూనే వుంటారు. కాని, తనకంటూ ఒక ప్రత్యేక అనుచర వర్గాన్ని పవన్ తయారు చేసుకున్నాడు. అదే అతడ్ని ఇండస్ట్రీలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ కి అతీతంగా నిలబెడుతోంది! ఏ హీరో తాలూకూ ఫంక్షన్ అయినా ప్రతీ చోటా పవన్ , పవన్ అంటూ అరుపులు వినిపించేలా చేస్తోంది!

పవన్ కళ్యాణ్ తన మేనియాని ఇన్నేళ్ల కాలంలో ఉద్దేశ్యపూర్వకంగా సృష్టించుకున్నాడా అంటే .... కాదనే చెప్పాలి. ఆయన తన చుట్టూ తానొక ప్రపంచం తనకు తెలియకుండానే నిర్మించుకున్నాడు! అందుకు మూలం... పవన్ విభిన్నమైన వ్యక్తిత్వం, నిజాయితీతో కూడిన ప్రవర్తన. ఈ రెండూ పవన్ కళ్యాణ్ ని ఒక హీరో స్థాయి నుంచి స్టార్ గా, స్టార్ నుంచి పవర్ స్టార్ గా ఎదిగేలా చేశాయి! ఫ్యాన్స్ తో కేవలం సినిమాల వరకు మాత్రమే బాక్సాఫీస్ బంధం కాకుండా ... రియల్ లైఫ్ అనుబంధం ఏర్పడేలా చేశాయి! 

కేవలం కొన్ని సంవత్సరాల్లోనే.... మిగతా హీరోలు దశాబ్దాల పాటు కష్టపడి సృష్టించుకున్న అభిమానుల సామ్రాజ్యాన్ని పవన్ ఏర్పాటు చేసుకున్నాడు. అది ఆయన ఇంకా ఇంకా విస్తరిస్తూ మరిన్ని జన్మదినాలు చేసుకోవాలని మనమూ ఆశిద్దాం...  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com