
జనతా గ్యారేజ్‌లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కథానాయికలు సందడి చేశారు. సమంత, నిత్యమేనన్,కాజల్‌లు కలసి ఈ సినిమాకి బోల్డంత గ్లామర్ యాడ్ చేస్తారనుకొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు. కానీ... వాళ్ల ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. సమంత, నిత్యల పాత్రలు గెస్ట్ రోల్స్‌కంటే దారుణంగా ఉన్నాయి. ఎన్టీఆర్ - సమంతలమధ్య ఒక్కటంటే ఒక్కటే డ్యూయెట్. సెకండాఫ్‌లో ఒక్కటంటే ఒక్క సీన్‌లో కనిపించింది. నిత్యమీనన్‌కు అదీ లేదు. గ్రూప్ సాంగ్ లో పొలో అంటూ పరుగులు పెట్టిందంతే. కాజల్ ఐటెమ్ పాటలో మెరిసింది. అయితే కాజల్ మాసీ స్టెప్పులు ఏమాత్రం ఆకట్టుకోలేదు. పైగా ముదురు టెంకలా కనిపించింది. సమంత గ్లామర్ అంతా ఎక్కడికిపోయిందో అర్థం కాలేదు. నిత్యమీనన్ ఇలా ప్రాధాన్యం లేని పాత్రలు ఎందుకు ఎంచుకొంటుందో? ముగ్గురు హీరోయిన్లున్నా... లేనట్టే అనిపించింది ఈసినిమాలో. మొత్తానికి ఈ ముగ్గురు పాపలూ ఈసినిమాకి మైనస్సే. తమ గ్లామర్ పరంగా ఈ హీరోయిన్లు నిరుత్సాహపరిస్తే... వాళ్ల పాత్రల్ని సరిగా తీర్చిదిద్దలేక దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.





.jpg)
