Home

»

Latest News

మూణ్ణెల్లలో పవన్ ది షాడో పూర్తి

Apr 7, 2011 4:49PM

pawan kalyan wallpapers, pawan kalyan stills, pawan kalyan images, pawan kalyan pics, pawan kalyan photos, pawan kalyan picturesమూణ్ణెల్లలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే "ది షాడో" చిత్రాన్నిపూర్తిచేయనున్నాడట. వివరాల్లోకి వెళితే తమిళంలో ప్రముఖ దర్శకుడు విష్ణు వర్థన్ తొలిసారిగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారాజైన్, జియాఖాన్ హీరోయిన్లుగా నటిస్తూండగా, విష్ణు వర్థన్ దర్శకత్వంలో "ది షాడో" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ "ది షాడో" చిత్రాన్నివిష్ణు వర్థన్ తన సహజ శైలిలో తొంభై రోజుల్లోనే పూర్తి చేయనున్నాడట. ఎందుకంటే విష్ణువర్థన్ తమిళంలో తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమానీ కేవలం ముణ్ణెల్లలోనే పూర్తి చేయటం రివాజట. విష్ణువర్థన్ కి తమిళ సినీ పరిశ్రమలో మిస్టర్ పర్ ఫెక్ట్ గా చాలా మంచి పేరుంది.


తమిళంలో తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో అత్యధిక శాతం సూపర్ హిట్లుండటమే అందుకు కారణం. అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్ లో సినిమాని తీయటంలో దర్శకుడు విష్ణు వర్థన్ మొనగాడని కోలీవుడ్ వర్గాలంటూంటాయి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ది షాడో" చిత్రం కేవలం షుటింగ్ మొదలుపెట్టిన తొంభై రోజులకే పూర్తికానుందన్నమాట. ఎందుకంటే ఒక సినిమా పూర్తిచేయటానికి దర్శకుడు విష్ణు వర్థన్ మూడు నెలలకు మించి సమయం తీసుకోడట. ఈ చిత్రం ఏప్రెల్ నెలలోనే ప్రారంభమయ్యే సూచనలున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com