Home

»

Latest News

స‌ర్దార్ Vs జ‌న‌తా

Sep 2, 2016 1:17PM

 

ఏదైనా కొత్త సినిమా, అందునా స్టార్ హీరో సినిమా వ‌స్తోందంటే రికార్డుల గురించే మాట్లాడుకొంటారంతా. తొలి రోజు ఎంత వ‌సూలు చేస్తుంది?  గ‌త రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొడుతుందా, లేదా?  ఈ లెక్క‌లే వినిపిస్తుంటాయి. జ‌న‌తా గ్యారేజ్ విడుద‌ల‌కు ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి లెక్క‌లే వేసుకొన్నారు. తొలిరోజు వ‌సూళ్ల‌లో ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని భావించారు. తొలి రోజు వ‌సూళ్ల ప‌రంగా.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ రూ.30 కోట్ల‌తో మొద‌టి స్థానంలో ఉంది. రెండో స్థానం బాహుబ‌లికి ద‌క్కింది. అయితే...  స‌ర్దార్‌కి జ‌న‌తా గ్యారేజ్ ద‌రి దాపుల్లోకి కూడా రాలేదు. బాహుబ‌లిని కూడా ట‌చ్ చేయ‌లేదు. ఓవ‌రాల్ గా జ‌న‌తా గ్యారేజ్ రూ.24 కోట్ల‌తో మూడో స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ కెరీర్‌లో మాత్రం ఇదే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కూ టాప్ 3లో ఉన్న శ్రీ‌మంతుడ్ని ప‌క్క‌కు నెట్టిందంతే. టాప్ 1లో చూద్దామంటే... 3లో కూర్చోవాల్సివ‌చ్చింది. రెండోరోజు వ‌సూళ్లు స‌గానికి స‌గం ప‌డిపోయే ప్ర‌మాదం ఉంది. ఓ వైపు భార‌త్ బంద్ కూడా భ‌య‌పెడుతోంది. మ‌రి.. ఏం జ‌రుగుతుందో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com