Home

»

Latest News

Pawan Kalyan: పవన్ కొత్త పిక్స్ వైరల్.. సోషల్ మీడియా షేక్

Jul 2, 2026 12:47PM

 


పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)కి కోట్లాది మంది అభిమానులు ఏర్పడడానికీ సినిమాల్లోని ఆయన నటనతో పాటు స్టైల్ ఒక కారణం. ఇప్పటికి పవన్ గత చిత్రాల్లోని స్టైల్ ని ఫాలో అయ్యే అభిమానులు ఎంతో మంది. ఈ కోవలోనే పవన్ తాజా పిక్స్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తున్నాయి. 

రీసెంట్ గా  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ లో  పవర్ స్టార్ నల్లటి హూడీ ధరించి, ఒత్తైన గడ్డంతో ఎంతో గాంభీర్యంగా కనిపిస్తున్నారు. ఆయనలో కనిపించిన ఈ వింటేజ్ గ్యాంగ్‌స్టర్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ గత కొన్ని ఏళ్లలో పవన్ కెరీర్‌లోనే బెస్ట్ స్టైలిష్ లుక్ అని అభిమానులు కొనియాడుతున్నారు.  ఈ పిక్స్ ఓజి 2 కోసమే అనే విషయం తెలిసిందే.  ఈ ఒక్క లుక్‌తోనే థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం ఉండబోతోందో అర్థమవుతోంది. పవన్, సుజీత్ కాంబోలో వచ్చిన ఓజీ" (OG) బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 295 కోట్ల కలెక్షన్లతో సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌కు సీక్వెల్‌గా రాబోతున్న "ఓజీ 2" (OG 2) అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. కేవలం పార్ట్ 2 ప్రకటన మాత్రమే కాకుండా, టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీగా నిలవబోయే "ఓజీ సినిమాటిక్ యూనివర్స్"ని  మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం వచ్చింది.


Also read: Shruti Haasan: శృతి హాసన్ తన ఐడెంటిటీ కోల్పోతుందా!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com