Home

»

Latest News

పవర్ స్టార్ ఈజ్ బ్యాక్.. హైదరాబాద్ లో అడుగుపెట్టిన పవన్!

Jan 7, 2022 11:47AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రష్యా వెకేషన్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన పవన్ కెమెరా కంటపడ్డారు. ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బ్లాక్ కలర్ టీషర్ట్, జీన్స్ లో పవన్ సరికొత్తగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో పవన్ వీడియోని ఓ అభిమాని ట్విట్టర్ లో షేర్ చేయగా.. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.

సంక్రాంతికి విడుదల కావాల్సిన పవన్ లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్' ఫిబ్రవరికి వాయిదా పడడంతో.. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం తన భార్య అన్నా లెజ్నెవా, పిల్లలతో కలిసి పవన్ గత డిసెంబర్ లో రష్యా వెళ్లారు. రష్యాలోనే భార్యా పిల్లలతో కలిసి క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారు. 

సినిమాల విషయానికొస్తే.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు పవన్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com