అకీరా కోసం పవన్.. ఆనందంలో రేణూ దేశాయ్
on May 24, 2022
పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తమ పిల్లల కోసం తల్లిదండ్రులుగా వారి బాధ్యత నిర్వహిస్తున్నారు. పవన్, రేణూల ముద్దుల తనయుడు అకీరా నందన్ తన హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో స్కూల్ లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి పవన్, రేణూ హాజరయ్యారు.
పవన్, రేణూ చట్టబద్ధంగా భార్యాభర్తలుగా విడిపోయారు. పవన్ మరో వివాహం చేసుకోగా.. రేణూ మాత్రం పిల్లలు అకీరా, ఆద్యలను చూసుకుంటూ ఉంటుంది. అయితే పవన్ కు వీలు కుదిరినప్పుడల్లా అకీరా, ఆద్యలతో సమయం గడుపుతుంటాడు. వారి బాగోగులు చూసుకుంటాడు. ఇక ఇప్పుడు కుమారుడి కోరిక మేరకు అకీరా గ్రాడ్యుయేషన్ డేలో పవన్ పాల్గొన్నాడు. ఈ వేడుకలో తమ ఇద్దరు పిల్లలతో కలిసి పవన్, రేణూ ఫోటో దిగారు. ఈ ఫోటోను రేణూ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ గా మారింది.
అకీరా గ్రాడ్యుయేషన్ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన రేణూ తన సంతోషాన్ని పంచుకుంది. ఇకపై ఉదయాన్నే స్కూల్ కి రెడీ అవ్వాల్సిన పని లేదని, బస్సుకి టైం అవుతుందన్న ఆందోళన అక్కర్లేదు, ట్యూషన్స్ అవసరం లేదు అంటూ అకీరా గురించి రాసుకొచ్చింది. స్కూల్ జర్నీ ముగిసిందని, ఇప్పటినుంచి అసలు జర్నీ స్టార్ట్ అవుతుందని.. పేరెంట్స్ సపోర్ట్ అవసరం లేకుండానే తను సొంతంగా ప్రకాశిస్తాడని భావిస్తున్నాని కుమారుడు గురించి రాసుకొచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
