భారీ స్థాయిలో 'F3' బిజినెస్.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
on May 25, 2022
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'F2' మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఏకంగా 80 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ ఫన్ ఫ్రాంచైజ్ నుంచి 'F3' సినిమా రాబోతోంది. 'F2' సక్సెస్ ప్రభావంతో మే 27న విడుదలవుతున్న 'F3'పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే 'F3' థియేట్రికల్ బిజినెస్ భారీస్థాయిలో జరిగింది.
ట్రేడ్ వర్గాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 'F3' మూవీ రికార్డు స్థాయిలో రూ.53.80 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. నైజాంలో 18 కోట్లు, సీడెడ్ లో 8.40 కోట్లు, ఆంధ్రాలో 27.40(ఉత్తరాంధ్ర 7 కోట్లు, ఈస్ట్ 4.50 కోట్లు, వెస్ట్ 4 కోట్లు, గుంటూరు 5 కోట్లు, కృష్ణ 4.50 కోట్లు, నెల్లూరు 2.40 కోట్లు) కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. అలాగే కర్ణాటక లో 3.40 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1.20 కోట్లు, ఓవర్సీస్ లో 5.20 కోట్ల బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా 63.60 కోట్ల బిజినెస్ 'F3'.. 64 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగనుంది.
'F2' సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించారు కాబట్టే ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు 'F3' కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే బ్రేక్ ఈవెన్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read