Home

»

Latest News

'పళ్ళబరుసు' టైటిల్ గ్లింప్స్.. అన్నపూర్ణ స్టూడియోస్ కొత్త సెన్సేషన్.!

Jul 17, 2026 5:26PM

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం 'పళ్ళబురుసు'. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం, మట్టి మనుషుల జీవన విధానం నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికరమైన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని ఈ గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఉదయ్ చౌహాన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

విడుదలైన 34 సెకన్ల టైటిల్ గ్లింప్స్ లో పల్లెటూరి ఉదయపు అందాలు, పచ్చని పొలాలు, కాలువ ప్రవాహం వంటి విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్లింప్స్ లో వినిపించే సంభాషణలు సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచుతున్నాయి. ఒక వృద్ధుడు(సుధాకర్ రెడ్డి) పొలంలో నిలబడి "ఆ.. ఏందిరా పళ్ళబురుసా.. తేలేదు ఆ కొడుకు" అని అరవడం, అలాగే బైక్ పై వెళ్తున్న యువకులు "పల్లబురుసు ఇంకా తేలేదా" అని మాట్లాడుకోవడం చూస్తుంటే ఈ 'పళ్ళబురుసు' అనే పదం చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందని అర్థమవుతోంది.

గ్లింప్స్ చివర్లో సుధాకర్ రెడ్డి వేప పుల్లతో పళ్ళు తోముతూ.. "వీడు పళ్ళబురుసు లేడు, నాకు నొప్పి తక్కువ కాదు." అంటాడు. ఇక మురళీధర్ గౌడ్ బైక్ స్టార్ట్ చేస్తూ "నా బిడ్డ పెళ్లి.. మా అయ్య లొల్లి.. ఏందో ఈ పళ్ళబురుసు" అంటూ తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్ తో గ్లింప్స్ ను ముగించారు. 

ఈ చిత్రానికి పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంది. ఈ సినిమాను 2026 ఆగస్టు 14వ తేదీన థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

 

 

Annapurna Studios, Pallaburusu, Title Glimpse, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com