Home

»

Latest News

ఎందుకు ఇలా తెరకెక్కించారు.. ఇక మారరా!

Jul 17, 2026 5:15PM

 

టాలీవుడ్‌లో విభిన్నమైన క్యారెక్టర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్ ఈ రోజు  టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ తో కలిసి ‘ఓ సుకుమారి’(O sukumari)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. భరత్ దర్శన్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ కామెడీ డ్రామా మూవీపై టాలీవుడ్‌లో మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. హీరోయిన్‌ను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందనే ఒక వింత వినూత్నమైన ఆలోచన ప్రధాన కాన్సెప్ట్‌.


ఈ రోజు థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్ ,రివ్యూస్ చూస్తే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. చాలా మంది ప్రేక్షకులు బాగోలేదని సోషల్ మీడియా వేదికగా కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కథనంలో లోపాలు. ఒక క్రేజీ ఐడియాతో కథని మొదలుపెట్టినప్పటికీ, దర్శకుడు దానిని పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడనేది సగటు సినిమా అభిమాని మాట. ఫస్ట్ హాఫ్ ఒక మాదిరిగా ఉన్నా    సెకండాఫ్‌లో కథనం చాలా నెమ్మదిగా సాగడం ప్రేక్షకులకి కాస్త బోర్ కొట్టించింది. ప్రతి పాత్రకు ఒక ముగింపు ఇవ్వాలనే తాపత్రయంలో క్లైమాక్స్ వైపు వెళ్లేసరికి సినిమా చాలా ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. రేటింగ్స్ పరంగా చూసుకున్నా చాలా వెబ్‌సైట్లు  5 కి 2 , 1 .5  రేటింగ్స్ ఇస్తున్నాయి.

Also read: అల్లు అర్జున్‌కి అవమానం.. చిరంజీవి ఏం చేసాడంటే?

తిరువీర్,  ఐశ్వర్య రాజేష్ తో పాటు మిగతా నటీనటుల పెర్ఫార్మ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.  కానీ కథ ప్రకారం కథనాన్ని, క్యారక్టరయిజేషన్స్ ని రాసుకోవడంలో దర్శకుడు భరత్ దర్శన్ విఫలమయ్యాడని మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నారు. 

Thiruveer,  o sukumari, Aishwarya Rajesh, tollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com