భారీ ఎమౌంట్ కు అమ్ముడైన ' ఊపిరి ' శాటిలైట్ రైట్స్..!
on Apr 12, 2016
సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ, సర్దార్ రిలీజ్ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని నిలబడింది ఊపిరి. ఈ సినిమాకు అన్నీ అద్భుతంగా కలిసొస్తున్నాయి. లెటెస్ట్ గా మూవీ శాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. సన్ నెట్ వర్క్ దాదాపు 14 కోట్లకు ఊపిరి శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. సన్ నెట్ వర్క్ కు తెలుగు, తమిళ లో కూడా చాలా ఛానెల్స్ ఉన్న సంగతి తెలిసిందే. రెండు భాషలకూ కలిపి ఇంత భారీ ఎమౌంట్ చెల్లించారని తెలుస్తోంది. మరో వైపు ఓవర్సీస్ లో కూడా ఊపిరి ఒకటిన్నర మిలియన్ మార్క్ ను దాటి భారీ హిట్ నమోదు చేసింది. ఫ్రెంచ్ లో వచ్చిన ది ఇంటచిబుల్స్ అనే సినిమాను ఊపిరి గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ద్విభాషా చిత్రంగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఊపిరి, తమిళంలో తోజా పేరుతో రిలీజయి అక్కడ బాగానే హిట్టయ్యింది. తమిళ్ కంటే తెలుగులోనే ఊపిరి మంచి హిట్ తెచ్చుకోవడం విశేషం.