
-సినిమా పేరు: ఓ సుకుమారి
-నటీనటులు: తిరువీర్, ఐశ్వర్య రాజేశ్, ఝాన్సీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు
-సినిమాటోగ్రఫీ: ఖుషేంధర్ రెడ్డి
-ఎడిటింగ్: శ్రీ వర
-మ్యూజిక్: భరత్ మంచిరాజు
-నిర్మాత:మహేశ్ రెడ్డి మూలీ
-బ్యానర్ : గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్
-రచన,దర్శకత్వం: భరత్ దర్శన్
-రిలీజ్ డేట్ : జులై 17 ,2026
ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కలిగించిన చిత్రం ఓ సుకుమారి ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. పైగా ఊహించని కాంబో తిరువీర్, ఐశ్వర్య రాజేష్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
దామిని..(ఐశ్వర్య రాజేష్) చలాకీ, చిలిపితనం నిండిన గడుసు యువతి. పుట్టినప్పటి నుంచే తనని ముట్టుకుంటే కరెంటు షాక్ కొడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే దామిని ముట్టుకుంటే చావు అంచుల దాకా వెళ్లి వస్తారు. దీంతో తన ఊరి ప్రజలు దామినిని చూసి భయపడుతుండటంతో పాటు ఒక నిర్ణయం తీసుకుంటారు. యాదగిరి( తిరువీర్) రాజకీయ పార్టీ పెట్టి ప్రెసిడెంట్ గా పోటీ చేసి గెలవాలని చూస్తుంటాడు. అర్జెంటు గా పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలని వెతికే ప్రాసెస్ లో దామిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని అనుకుంటాడు. మరి దామినిని యాదగిరి పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకుంటే దామినికి ఉన్న ప్రాబ్లెమ్ తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఏం చేసాడు? అసలు దామిని కి ఆ ప్రాబ్లెమ్ ఎలా వచ్చింది? అందుకు సొల్యూషన్ ఏంటనేదే ఓ సుకుమారి.
ఎనాలసిస్
కథ పాయింట్ మంచిదే అయినా కథనం మొత్తం పాత చింతకాయ పచ్చడి. ఇలాంటి పాయింట్ తో కూడిన కథలని సిటీ బ్యాక్ డ్రాప్ లో యువతీ యువకుల మధ్య జరిగే భావోద్వేగ కథగా చిత్రీకరించాలి. ఏదో ఒక వెరైటీ పాయింట్ దొరికిందని ఇష్టమొచ్చిన సన్నివేశాలతో నింపేశారు. ఆ విధంగా హీరోయిన్ క్యారక్టర్ కి ఒక డిఫరెంట్ ప్రాబ్లెమ్ ని ఎస్టాబ్లిష్ చేసి ఇష్టమొచ్చిన రీతిలో కథనాన్ని నడిపించే సినిమాలు చాలా వచ్చాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఓపినింగ్ సీన్ కొంచం క్యూరియాసిటీ కలిగిచిన ఆ తర్వాత వచ్చిన సీన్స్ మొత్తం రొటీన్. యాదగిరి, బాబాయ్ మధ్య ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ మాత్రం బాగున్నాయి. ఊరు మొత్తం దామినిని ఊరు నుంచి వెళ్ళగొట్టాలని పెళ్లి చెయ్యాలని పగతో ఉండటం అనే పాయింట్ వర్క్ అవుట్ కాలేదు. దామినిని ముట్టుకోకుండా ఉంటె సరిపోతుంది కదా. దామిని, యాదగిరి పెళ్లి ఎపిసోడ్ బాగుంది. ఫస్ట్ నైట్ సీన్ ని ఎంతో ఎగ్జైట్మెంట్ గా ప్లాన్ చెయ్యాల్సింది పోయి తూతూ మంత్రంగా కానిచ్చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిందే. సెకండ్ హాఫ్ చూసుకుంటే లాజిక్ లేని సీన్స్, అనవసరమైన సీన్స్ తో ఫస్ట్ హాఫ్ బెటర్ అనేలా ఉంది. ఏ ఒక్క సీన్ కూడా మెప్పించలేదు, కథకి కూడా హెల్ప్ అవ్వలేదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సైతం బాగోలేదు. దామినికి ఉన్న షాక్ ప్రాబ్లెమ్, చివరకి ఆ ప్రాబ్లెమ్ పోవడం అనేది కన్విన్స్ గా లేదు.
నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు
యాదగిరిగా తిరువీర్ పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. పెర్ఫార్మ్ కూడా బాగుంది. కానీ కథనంలోని లోపాల వల్ల తిరువీర్ పెర్ఫార్మ్ గురించి చెప్పుకునే పరిస్థితి ఉండదు. దామిని గా ఐశ్వర్య రాజేష్ మరో సారి నాచురల్ పెర్ఫార్మ్ తో ఆకట్టుకుంది. సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ సన్నివేశాలలో ఒక రేంజ్ పెర్ఫార్మ్ ప్రదర్శించింది. మిగతా క్యారక్టర్ లలో చేసిన వారి గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేకపోయినా ఆమని, ఝాన్సీ, ఆనంద్, తిరువీర్ బాబాయ్ తమ క్యారక్టర్ పరిధి మేరకు మంచి పెర్ఫార్మ్ తో మెప్పించారు. దర్శక,రచయిత భరత్ దర్శన్ ఆ రెండు విభాగాల్లోనూ పెద్దగా మెప్పించలేకపోయాడు. క్యారెక్టర్స్ యొక్క విధి విధానాలని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చెయ్యడంలో తడబడ్డాడు. డైలాగ్స్ అక్కడక్కడ కొన్ని బాగున్నాయి. సంగీత దర్శకుడు భరత్ మాచిరాజు నుంచి వచ్చిన సాంగ్స్ బాగోలేదు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సో సో . నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
1 . దామిని కి ఉన్న షాక్ ప్రాబ్లమ్
2 . ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మ్
3 . తిరువీర్ పెర్ఫార్మ్
బలహీనతలు
1 . కథనం
2 . దర్శకత్వం
3 . డైలాగ్స్
4 .సెకండ్ హాఫ్
చివరిగా చెప్పాలంటే ఆకట్టుకోలేని కథనంతో 'ఓ సుకుమారి' కి అన్యాయం జరిగింది
రేటింగ్ 2 /5 అరుణాచలం





