.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో 'ఓజి' సాధించిన విజయం తాలూకు ప్రకంపనలు ఇంకా అభిమానుల మెదళ్లలో నుంచి పోలేదు. వాళ్ళకి అంత స్పెషల్ మూవీ. పవన్ కి కూడా స్పెషల్ మూవీ అని చెప్పుకోవడంలో అతుసయోక్తి లేదు. అంతలా 300 కోట్ల కలెక్షన్స్ తో ఎంటైర్ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి ఈ లెక్కన ఓ OG పార్ట్ 2 పై అంచనాలు ఏ విధంగా ఉంటాయో చెప్పక్కర్లేదు. కానీ ఎప్పుడు షూటింగ్‌కి వెళ్లి కంప్లీట్ చేసుకొని ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందనే డిస్కర్షన్ పవన్ ఫ్యాన్స్ తమ రోజు వారి దినచర్యలో భాగంగా చేర్చుకున్నారు.
ఓజి పార్ట్ 2 ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే విషయానికి వస్తే నవంబర్ లో ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ మధ్యన పవన్ వరుసగా అనారోగ్య సమస్యలకి గురి కావడంతో నవంబర్ డౌట్ అనే అంటున్నారు. తిరిగి ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో కనీసం రూమర్ గా అయినా ఎలాంటి వార్త హల్ చల్ చేయడం లేదు. ఏది ఏమైనా అభిమానులు మాత్రం ఓజి 2 అప్ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. యధావిధిగా సుజిత్ దర్శకుడు.
Also read: ఓటిటిలోకి శ్రీనివాస మంగాపురం
Pawan Kalyan, Og 2, Sujeeth






