
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఇరుముడి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా, ఆగష్టు 21న థియేటర్లలో అడుగుపెట్టనుంది. 'ఇరుముడి'పై మొదటినుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రతి కంటెంట్ మెప్పించింది. దీంతో రవితేజ అదిరిపోయే కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని భావిస్తున్నారంతా. ఇక ఇప్పుడు ఈ మూవీ ఇన్‌సైడ్ టాక్ కూడా హాట్ టాపిక్ గా మారింది.
'ఇరుముడి' సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇన్‌సైడ్ టాక్ పాజిటివ్ గా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఏ సినిమాకు అయినా ఫస్ట్ హాఫ్ హైలైట్, సెకండ్ హాఫ్ యావరేజ్ అనే టాక్ ఎక్కువగా వినిపిస్తూ వస్తోంది. కానీ, 'ఇరుముడి' విషయంలో రివర్స్ టాక్ వినిపిస్తోంది. సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుందని అంటున్నారు.
సినిమా రిజల్ట్ అనేది సెకండ్ హాఫ్ మీదే ఆధారపడి ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎంత బాగుంటే, సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. ప్రస్తుత టాక్ ను బట్టి చూస్తుంటే.. 'ఇరుముడి' మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమనిపిస్తోంది.
Irumudi Movie, Ravi Teja, Shiva Nirvana




.webp)
