
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటేనే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఈ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
ఈసారి ఇద్దరూ కలిసి చాలా పెద్ద స్కేల్‌లో వస్తున్నారు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ తెరకెక్కించబోయే మైథలాజికల్ మూవీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ‘గాడ్ ఆఫ్ వార్’గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు త్రివిక్రమ్.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ రూపొందించిన 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ మూవీపై ప్రమోషన్స్ లో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ గురించి స్పందించారు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని, ఇంకా టైటిల్ మాత్రం ఫిక్స్ చేయలేదని తెలిపారు.
సుబ్రహ్మణ్య స్వామి కథతో మైథలాజికల్ విజువల్ వండర్ లా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ కి, త్రివిక్రమ్ కి పురాణాలపై ఉన్న పట్టు తోడైతే.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాకే ఎన్టీఆర్–త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఇది కూడా చదవండి: ఫస్ట్ టైమ్ అలాంటి పాత్రలో.. లోకేష్ కనగరాజ్ సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఇదే.!
[God Of War Update, NTR Trivikram Movie, God Of War Movie, Aadarsha Kutumbam Movie, Trivikram Interview, NTR God of War, NTR Subramanya Swamy, NTR Murugan Role, NTR Dragon, Telugu Film News]





