
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’ (Dragon) గ్లింప్స్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తూ, ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో అత్యంత భారీ స్కేల్‌పై ఈ గ్లింప్స్‌ను కట్ చేశారు. ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్, తారక్ ఫెరోషియస్ లుక్ చూస్తుంటే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. (Dragon Glimpse)
ఈ చిత్రం కథా నేపథ్యం సాధారణ మాఫియా కాకుండా, అంతర్జాతీయంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’ చుట్టూ తిరగనుంది. థాయిలాండ్, లావోస్, మయన్మార్ సరిహద్దులతో కూడిన ఈ ప్రాంతం నల్లమందు (ఓపియం) సాగుకు, ప్రపంచంలోనే పీక్ మాఫియా గ్యాంగ్ వార్స్‌కు కేరాఫ్ అడ్రస్. బ్రిటిష్ కాలం నాటి నల్లమందు యుద్ధాల నుండి నేటి కాంటెంపరరీ అంతర్జాతీయ మాఫియా వరకు జరిగిన గొడవలను లింక్ చేస్తూ ప్రశాంత్ నీల్ ఒక అద్భుతమైన కథను అల్లుకున్నట్లు తెలుస్తోంది.
గ్లింప్స్ ప్రారంభంలో నటి రుక్మిణి వసంత్ బైబిల్ ఆదికాండం తరహాలో చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. దేవుడు సృష్టిని నిర్మించిన తర్వాత వచ్చిన గ్యాప్‌లో ఒక ‘డెవిల్’ పుట్టిందని చెబుతూ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను రివీల్ చేసిన తీరు భీభత్సం అనే చెప్పాలి. తారక్ బాడీ లాంగ్వేజ్, కళ్లల్లో ఆ క్రూరత్వం, మునుపెన్నడూ చూడని సరికొత్త ఆహార్యం అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ‘ఈ కథలో అందరూ విలన్లేనా.. హీరోలు లేరా?’ అని ప్రశ్నించే క్రమంలో దైవమే హీరోని ఎంచుకుంటుంది అనే పద్ధతిలో కథను మలుపు తిప్పడం విశేషం. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను మరింత నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.
మొత్తానికి ప్రశాంత్ నీల్ తన కంటెంట్‌కు కట్టుబడి ఎక్కడా లూజ్ కాకుండా ఈ గ్లింప్స్‌ను డిజైన్ చేశారు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, ఆగ్నేయాసియా మాఫియా చరిత్రకు సంబంధించిన ఒక సరికొత్త నాలెడ్జ్ ఇచ్చే చిత్రంగా ఇది నిలవబోతోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను మరోసారి కొల్లగొట్టేందుకు ఎన్టీఆర్-నీల్ చేసిన ఈ ప్రయోగం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తోంది.





