Home

»

Latest News

మ‌హేష్ బాట‌లో తార‌క్‌!!

Mar 6, 2019 3:04PM

ఇటీవ‌ల మ‌హేష్ బాబు  ఏషియ‌న్ సినిమాస్ తో క‌లిసి` ఏయంబి సినిమాస్` పేరుతో గ‌చ్చిబౌళిలో మ‌ల్టీప్లెక్స్  ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే బాట‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా థయేట‌ర్స్ బిజినెస్  రంగంలో దిగ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  `ఏషియ‌న్ సినిమాస్ ` వారితో  క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ల్టీప్లెక్స్ ల‌ను నిర్మించే దిశగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయ‌ట‌. ముందుగా అమరావ‌తిలో ప్రారంభించి ఆ త‌ర్వాత వైజాగ్ లో కూడా మ‌ల్టీప్లెక్స్ బిజెనెస్ లు ప్రారంభించాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట తార‌క్. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర నుంచి రావాల్సిన అప్రూవ‌ల్ కోసం ఎదురు చూస్తున్నార‌ట‌. ఆ అప్రూవ‌ల్ అందిన వెంట‌నే ప‌నులు ప్రారంభిచ‌డానికి తారక్ అండ్ టీమ్ మొత్తం రెడీ గా ఉంద‌ట‌. ప్ర‌జంట్ ఎన్టీఆర్ రామ్ చర‌ణ్ తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు యాడ్స్ త‌ప్ప బిజినెస్ పై దృష్టి పెట్ట‌ని తార‌క్ తొలిసారిగా మ‌ల్టీప్లెక్స్ పై దృష్టి పెట్టాడు. ఏదైనా లాంగ్ లైఫ్ ఉండే బిజినెస్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగా వచ్చిందే మ‌ల్టీప్లెక్స్ బిజెనెస్ అని తెలుస్తోంది. తార‌క్ తో పాటు ఇంకా కొంత మంది కూడా సినిమాల‌తో పాటు బిజినెస్ లు కూడా ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com