Home

»

Latest News

మెగాస్ట‌ర్ పంపిన మెసేజ్‌లో ఏముంది!!

Mar 6, 2019 11:38AM


                             

మ‌నం చేసిన ప‌నిని ఎవ‌రైనా గుర్తించి  ప్ర‌శంసిస్తే మ‌న‌కు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే మెగాస్టార్ లాంటి వ్య‌క్తి ప్ర‌శంసిస్తే ఆ ఆనందం వ‌ర్ణ‌నాతీతం. ఇప్పుడు నిఖిల్ అలాంటి  సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఎందుక‌నేగా మీ సందేహం అక్క‌డికే వ‌స్తున్నా. నిఖిల్ హీరోగా సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో `అర్జున్ సుర‌వ‌రం` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. విడుద‌లైన 24 గంట‌ల్లో వ‌న్ మిలియ‌న్ వ్యూస్ ని క్రాస్ చేసింది. ఈ టీజ‌ర్ ను  చూసిన మెగాస్ట‌ర్ చిరంజీవి నిర్మాత రాజ్ కుమార్ ఒక మెసేజ్ పంపించాడ‌ట‌. అందులో `` ఇప్పుడే అర్జున్  సుర‌వ‌రం` టీజ‌న్ చూసాను. చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. మీకు ..ద‌ర్శ‌కుడికి, నిఖిల్ కి ఆల్ ది బెస్ట్ అని రాసుంద‌ట‌. దాన్ని ప‌దే ప‌దే చూసుకుని మురిసిపోతున్న నిర్మాత ద‌గ్గ‌ర  నుంచి నిఖిల్ ఫోన్ లాక్కోని చూసి షాక‌య్య‌డ‌ట‌. నిజంగా  ఇది మ‌రిచిపోలేని అనుభూతి అంటూ మురిసిపోతున్నారు నిఖిల్ తో పాటు చిత్ర బృందం. చిరంజీవి ఇటీవ‌ల కాలంలో చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు పొందితే ఆ టీమ్ అంద‌రినీ ఇంటికి పిలిచి స‌త్క‌రించ‌డ‌మే కాకుండా వారికి బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. నిజంగా ఇది కొత్త వార‌కి ఒక మంచి ప్రోత్సాహం లాంటిది అని చెప్పాలి. ఈ విష‌యం లో   సినిమా పెద్ద‌లు చిరంజీవిని అభినందిస్తున్నారు. ఇది మంచి ప‌రిణామం అంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com