Home

»

Latest News

యన్ టి ఆర్, నాగచైతన్యల గుండమ్మ కథ

Apr 13, 2011 2:50PM

ntr wallpapers, ntr stills, ntr images, ntr pics, ntr photos, ntr pictures యన్ టి ఆర్, నాగచైతన్యల గుండమ్మ ఎవరు.....? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. ప్రస్తుతం గుండమ్మ గనక దొరికితే అలనాటి మేటి చిత్రం "గుండమ్మ కథ" చిత్రాన్ని యన్ టి ఆర్, నాగచైతన్యలతో రీమేక్ చేయటానికి తాను తయారుగా ఉన్నానని మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు తెలుగువన్ కు తెలిపారు. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ గుండమ్మను వెతికే పనిలో ఉన్నారనీ, వాణిశ్రీని గుండమ్మ పాత్రకు అడుగుతున్నామనీ, ఆమె అంగీకరిస్తే ఈ "గుండమ్మ కథ" రిమేక్ త్వరలో ప్రారంభంవుతుందని కూడా ఆయన అన్నారు.

 

ntr wallpapers, ntr stills, ntr images, ntr pics,  vanisri gundamma katha ntr photos, ntr pictures

 

గతంలో ఇదే విశ్వవిఖ్యాతనటసార్వభౌమ, నటరత్న, డాక్టర్ యన్ టి రామారావు, నటసామ్రాట్ నాగేశ్వరరావు, నవరసనటసార్వభౌమ యస్ వి ఆర్, సావిత్రి, జమున , రమణారెడ్డి, రాజనాల, హరనాథ్, యల్ విజయలక్ష్మీ తదితరులు నటించగా, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించిన "గుండమ్మ కథ" చిత్రం తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచింది. అదే చిత్రాన్ని ఇప్పుడు ఆనాటి మేటి హీరోల నట వారసులు జూనియర్ యన్ టి ఆర్, నాగచైతన్య హీరోలుగా, వాణిశ్రీని గుండమ్మగా నటింపజేస్తూ నిర్మించాలని రామానాయుడుగారి సంకల్పం. అది త్వరలో నెరవేరాలని ఆశిద్దాం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com