Home

»

Latest News

'డ్రాగన్' సెట్స్‌లో ఎన్టీఆర్ పార్టీ రచ్చ.!

Jul 27, 2026 3:50PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం 'డ్రాగన్' బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించేందుకు వేగంగా సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రతి ఒక్క చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చి నెట్టింట రచ్చ చేస్తోంది. 

ఇటీవల చిత్ర యూనిట్ ఒక పవర్ ప్యాక్డ్ అండ్ కలర్‌ఫుల్ 'పార్టీ వైబ్' సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన పార్టీ సీక్వెన్స్ చిత్రీకరణలో ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ రుక్మిణి వసంత్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత స్టైలిష్‌గా, యుత్‌ఫుల్‌గా, మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో డిజైన్ చేశారని ఫిలిం నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్‌లో సాధారణంగా ఉండే డార్క్ అండ్ రా అట్మాస్ఫియర్‌కి భిన్నంగా, ఈ పార్టీ సీక్వెన్స్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందట. ఈ సీన్‌లో రుక్మిణి వసంత్ గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుందని ఇన్సైడ్ టాక్.

ఇక ఈ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ చూపించిన తీరు అల్టిమేట్ అని చెబుతున్నారు. ఈ మొత్తం పార్టీ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ కనిపించే తీరు వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం. మద్యం మైకంలో, పవర్‌ఫుల్ అండ్ డిఫరెంట్ ఆటిట్యూడ్‌తో ఎన్టీఆర్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ వింటేజ్ తారక్‌ను గుర్తుచేసేలా ఉంటాయని అంటున్నారు. ఎన్టీఆర్ స్వతహాగా మాస్ యాక్షన్, కామిక్ టైమింగ్‌లో సిద్ధహస్తుడు. అలాంటి నటుడికి ప్రశాంత్ నీల్ తన మార్క్ హై-ఎనర్జీ ఎలివేషన్లను తోడు చేయడంతో ఈ సీన్ సినిమాలో ప్రధాన హైలైట్లలో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

Dragon Movie, Jr NTR, Prashanth Neel, Rukmini Vasanth

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com