
'ఏమిటో'... అనే మూడంటే మూడే అక్షరాలతో కూడిన డైలాగ్ ని పలు రకాల వయ్యారంతో చెప్పి బోలెడంత మంది అభిమానులని సంపాదించడమే కాకుండా ప్రతి తెలుగు వాళ్ళ ఇళ్లల్లో తిష్ట వేసింది ఆమని(Aamani). ప్రెజెంట్ తల్లిగా, క్యారక్టర్ ఆర్టిస్ గా సినిమాలతో పాటు బుల్లి తెరపై మెరుస్తూ నటన అంటే తనకి ఎంత మక్కువో నిరూపిస్తుంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది.
ఆమని మాట్లాడుతు చిన్నతనం నుంచే కథానాయిక కావాలని కలలు కంటూ, అద్దంలో నన్ను నేను చూసుకుంటూ మురిసిపోయేదాన్ని. నటిగా గుర్తింపు పొంది పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి దర్శకుడు ఈ.వి.వి. సత్యనారాయణ గారే ప్రధాన కారణం. నా అసలు పేరు మంజు.మొదట సినీ అవకాశాల కోసం గంగమ్మరాజు గారు నా పేరుని మీనా', ఆ తర్వాత 'మీనాక్షి'గా మార్చారు. కానీ చివరికి ఈ.వి.వి. సత్యనారాయణ గారు 'ఆమని'గా ఫిక్స్ చేసారు. ఒకవేళ ఆయనే గనుక ఆ పేరు పెట్టకపోతే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండేదానిని కాదేమో.ప్రస్తుతం తన ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ మొదలుకొని అన్ని అధికారిక పత్రాల్లోనూ 'ఆమని' అనే పేరే స్థిరపడిపోయింది.
Also read: విజయ్‌పై సీనియర్ నటుడు నిళ్‌గల్ రవి షాకింగ్ కామెంట్స్..రజినీకాంత్ సీఎం అయ్యేవారు
స్టార్ హీరో జగపతి బాబు(Jagapathi Babu)నాది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని చూసి ప్రేక్షకులు నిజమైన భార్యాభర్తలుగా భావించేవారు. రియల్ లైఫ్‌లో కూడా జగపతిబాబుని పెళ్లి చేసుకోమని చాలామంది సలహాలు కూడా ఇచ్చారు . అయితే, అప్పట్లో తన దృష్టి అంతా కేవలం నటనపైనే ఉండేదని, ఎలాంటి క్రష్‌లు లేదా ఇతర ఆలోచనలు లేవని ఆమె స్పష్టం చేశారు. తన కుటుంబ బాధ్యతలు, కెరీర్ లక్ష్యాల కారణంగానే గతంలో ఒక తమిళ వ్యక్తి నుంచి వచ్చిన వివాహ ప్రతిపాదనను కూడా తిరస్కరించినట్లు ఆమని తెలిపారు. జగపతిబాబు, ఆమని కాంబోలో శుభలగ్నం, మావిచిగురు, శుభమస్తు వంటి చిత్రాలు వచ్చాయి. మూడు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్.
Aamani, Jagapathi Babu, Evv Sathyanarayana






